అర్ధరాత్రి రుయాలో హల్‌చల్
ABN , Publish Date - Nov 03 , 2024 | 02:27 AM
మద్యం మత్తులో ఇద్దరు యువకులు అతివేగంగా కారు నడుపుతూ రుయాస్పత్రిలోకి దూసుకొచ్చిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
మద్యం మత్తులో కారులో దూసుకువచ్చిన యువకులు
అడ్డుకున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నం
తిరుపతి(వైద్యం), అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఇద్దరు యువకులు అతివేగంగా కారు నడుపుతూ రుయాస్పత్రిలోకి దూసుకొచ్చిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తాతయ్యగుంటకు చెందిన దాము, మునిశేఖర్ పూటుగా మద్యం తాగి కారులో వేగంగా రుయాస్పత్రిలోకి దూసుకెళ్లారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ సిబ్బందిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టారు. ఆ సమయంలో అక్కడ రోగులు, సహాయకులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు డివైడర్‌ను ఢీకొట్టిన శబ్ధానికి అక్కడున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అవుట్ పోస్టులోని పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా కారులో పక్క సీట్లో కూర్చున్న మునిశేఖర్ తలకు గాయం కాగా నడుపుతున్న దాముకు స్వల్ప గాయాలయ్యాయి. కారును అక్కడే విడిచిపెట్టి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు వాగ్వాదానికి దిగారు. దాడి చేసేందుకు తెగబడ్డారు. అదుపులోకి తీసుకొని వెస్ట్ పోలీసులకు అప్పగించారు. స్టేషన్‌కు తీసుకువెళ్లిన గంట వ్యవధిలోనే ఆ ఇద్దరు యువకులు తిరిగి రుయాస్పత్రికి చేరుకుని ‘మమ్మల్నే పోలీసులకు పట్టిస్తారా.. మీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది వారికి నచ్చజెప్పి పంపించారు. డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ీయూ ఆధ్వర్యంలో పుత్తూరు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి రోజాతో పాటు వైసీపీ నాయకులు నారాయణస్వామి, కరుణాకరరెడ్డి, మునివేలు, జయప్రకాష్, చిన్నా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.