Share News

Hunting-బతుకు వేట

ABN , Publish Date - Nov 29 , 2024 | 12:26 AM

మాసిన గడ్డాలు, నలిగిపోయిన బట్టలు, కాలికి అంటిన సిమెంటు మరకలతో ఇక్కడున్న వారంతా బేల్దారి పనుల కోసం ఎదురుచూస్తున్న కూలీలు. రోజూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పనుల కోసం కూలీలు ఇక్కడ గుమికూడి ఎదురుచూస్తారు.

 Hunting-బతుకు వేట

మాసిన గడ్డాలు, నలిగిపోయిన బట్టలు, కాలికి అంటిన సిమెంటు మరకలతో ఇక్కడున్న వారంతా బేల్దారి పనుల కోసం ఎదురుచూస్తున్న కూలీలు. రోజూ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పనుల కోసం కూలీలు ఇక్కడ గుమికూడి ఎదురుచూస్తారు.చిత్తూరు నగరమే కాకుండా యాదమరి, బంగారుపాళ్యం, గుడిపాల, జీడీ నెల్లూరు, పూతలపట్టు ప్రాంతాల నుంచి రోజూ 150మంది కూలీలు ఉదయం లేవగానే చిత్తూరు చర్చివీధిలోని మార్కెట్‌ చౌక్‌కు చేరుకుంటారు. నగరంలో జరుగుతున్న పనుల కోసం కాంట్రాక్టర్లు, మేస్త్రీలు అక్కడకొచ్చి అవసరమైనంత మంది కూలీలను ఆటోల్లో, ద్విచక్రవాహనాలపై తీసుకెళతారు.పనులు దొరకనివారు అక్కడే మధ్యాహ్నం వరకు ఉండి వెంటతెచ్చుకున్న భోజనాన్ని అక్కడే తిని ఇళ్లకు వెళతారు.

-ఆంధ్రజ్యోతి, చిత్తూరు

Updated Date - Nov 29 , 2024 | 12:26 AM