Share News

ఓట్ల లెక్కింపు కోసం 22 కేంద్రాల గుర్తింపు

ABN , Publish Date - May 21 , 2024 | 02:08 AM

వచ్చేనెల 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 22 కేంద్రాలను గుర్తించారు. ఈనెల 13న పోలింగ్‌ అనంతరం ఎస్వీసెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో గుర్తించిన స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచారు.

ఓట్ల లెక్కింపు కోసం 22 కేంద్రాల గుర్తింపు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 20: వచ్చేనెల 4న జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 22 కేంద్రాలను గుర్తించారు. ఈనెల 13న పోలింగ్‌ అనంతరం ఎస్వీసెట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో గుర్తించిన స్ట్రాంగ్‌రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచారు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈవీఎంల భద్రతకు స్ట్రాంగ్‌రూమ్‌లుగా 28 గదులు, ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్‌ కేంద్రాలుగా 22 గదులు, అదనపు గదులుగా 14 గదులు వెరసి 64 గదులను గుర్తించారు. కాగా కళాశాలలోని ఏ, బీ బ్లాక్‌ల్లో ఉన్న గదుల్లో రిజర్వ్‌, డిఫెక్టివ్‌ ఈవీఎంల నిల్వల కోసం అసెంబ్లీకి ఏడు, పార్లమెంటుకు ఏడు గదులు కేటాయించారు.

Updated Date - May 21 , 2024 | 07:15 AM