Share News

గజలక్ష్మి నమోస్తుతే!

ABN , Publish Date - Dec 03 , 2024 | 02:35 AM

సోమవారం రాత్రి 7 గంటల నుంచి గజవాహన సేవ నయనానందకరంగా సాగింది. బంగారుకాసుల హారాన్ని ధరించిన అమ్మవారు గజవాహనంపై శ్రీ మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

గజలక్ష్మి నమోస్తుతే!

సోమవారం రాత్రి 7 గంటల నుంచి గజవాహన సేవ నయనానందకరంగా సాగింది. బంగారుకాసుల హారాన్ని ధరించిన అమ్మవారు గజవాహనంపై శ్రీ మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది గజవాహనం. ఐశ్వర్యానికి ప్రతిరూపమైన గజవాహనంపై కొలువుదీరిన అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తజన హృదయాలను రంజింపచేశారు. కీలుగుర్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనలు, జీయర్ల పరివారం ప్రబంధ పారాయణం చేస్తుండగా గజవాహనసేవ మాడవీధుల్లో సాగింది.

- తిరుచానూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 03 , 2024 | 02:35 AM