క్లిక్ చేస్తే ...
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:37 AM
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆస్తి కొనుగోలు, విక్రయం, వీలునామా తదితరాలకు సంబంధించి ఈ పత్రాలే ఆధారం.
డాక్యుమెంట్ నకళ్ళు ప్రత్యక్షం
ఈసీలు, సీసీలతో పాటు మరో మూడు సేవలు లభ్యం
ఆన్‌లైన్‌లోనే రుసుము చెల్లింపు
ఫ వైసీపీ ప్రభుత్వం ఏకంగా తొలగిస్తే... కూటమి ప్రభుత్వం చేసింది సులభతరం
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆస్తి కొనుగోలు, విక్రయం, వీలునామా తదితరాలకు సంబంధించి ఈ పత్రాలే ఆధారం. ఇంత కీలకమైన డాక్యుమెంట్లు, నకళ్ళు, ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్) ల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగడం ఏళ్ళ తరబడిగా చూస్తున్నాం. గతంలో రిజిస్ట్రేషన్‌శాఖ వెబ్ పోర్టల్ ద్వారా కొనసాగిన ఈ సేవలను వైసీపీ పాలనలో తొలగించింది. తాజాగా కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం చేస్తోంది. ఇంటర్నెట్ ద్వారా ఈసీ, సీసీ కాపీలను పొందే వెసులుబాటు కల్పించింది. ఇందుకు సర్వర్ కష్టాలు లేకుండా కొత్త ఆప్షన్లను తాజాగా సిద్ధం చేశారు. ఆన్‌లైన్‌లోనే రుసుము చెల్లించి తక్షణం ఈసీ, సీసీ కాపీలను తీసుకోవచ్చు.
ఫ జిల్లాలో బంగారుపాళ్యం, కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు (ఆర్వో), కార్వేటినగరం, నగరి, చిత్తూరు రూరల్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. 697 పంచాయతీల పరిధిలో 612 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ప్రజలకు సులభతరమైన సేవలు అందించేందుకు ఇంటర్నెట్ ద్వారా ఈసీ, సీసీ, ఇతర డాక్యుమెంట్లను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ విధానంలో సర్వర్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పొందే సేవలు ఇవే...
ఫ జ్ట్టిఞ://ట్ఛజజీట్టట్చ్టజీౌుఽ.్చఞ.జౌఠి.జీుఽ పోర్టల్ ద్వారా ఈసీ, సీసీ, పబ్లిక్ డేటా ఎంట్రీ, స్టాంప్ ఇండెంట్, ఎంవీ అసిస్టెన్స్ సేవలు కూడా పొందవచ్చు. పోర్టల్‌లో కుడివైపు వున్న ఈసీ, సీసీ సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే సంబంధిత సేవల పేజీ వస్తుంది. దానిపై ఈసీ ఇన్ఫర్మేషన్, ఈసీ సైన్డ్, సీసీ ఆప్షన్లు కనిపిస్తాయి. రిజిస్ట్రార్ సంతకం లేకుండా ఈసీ కావాలంటే తొలి ఆప్షన్‌పై క్లిక్ చేసి పేరు, చిరునామా, డాక్యుమెంట్ నెంబరు, రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరం నమోదు చేస్తే ఎలాంటి రుసుము లేకుండా ఇన్ఫర్మేషన్ ఈసీ వస్తుంది.
ఫ సైన్డ్ ఈసీ, సీసీ కావాలంటే రెండు లేదా ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వచ్చిన ఆప్షన్‌లో మెయిల్ ఐడీ, సెల్, ఫోన్, ఆధార్ సంఖ్యలను నమోదు చేయాలి. లాగిన్ కాగానే ఓటీపీ నమోదు చేసి సబ్మిట్ చేస్తే ఈసీ, సీసీ ఆప్షన్లు కనిపిస్తాయి. మనకు అవసరమైన ఆప్షన్‌పై క్లిక్‌చేసి డాక్యుమెంట్ నెంబరు, రిజిస్ట్రేషన్ సంవత్సరం, రిజిస్ట్రార్ కార్యాలయం చిరునామా, పేరు, అడిగిన వివరాలను నిక్షిప్తంచేసి సబ్మిట్ చేయాలి.
ఫ ఈ ప్రక్రియ తర్వాత ఆన్‌లైన్‌లో రుసుము చెల్లిస్తే యూజర్ లాగిన్‌తో డాక్యుమెంట్ ఫైల్ కనబడుతుంది. రిజిస్ట్రార్ సంతకం ఉన్న ఈసీ కాపీని కూడా ఇదే తరహాలో పొందవచ్చు.
రుసుము చెల్లింపు ఇలా ...
ఫ ఈసీ, సీసీ డాక్యుమెంట్ కాపీకి రూ.320
ఫ ఈసీ 30ఏళ్ళ పైబడిన సమాచారంతో కావాలంటే రూ.600
ఫ 30ఏళ్ళలోపు ఈసీ సమాచారానికి రూ.300 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది.