Share News

రుయాస్పత్రిలో ఫ్లెక్సీలు పెడితే చర్యలు

ABN , Publish Date - Oct 26 , 2024 | 01:59 AM

తిరుపతి రుయాస్పత్రి నో ఫ్లెక్సీ జోన్‌ అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ పథకాల బోర్డులు తప్ప, ఇతర ఫ్లెక్సీలు, బోర్డులు పెడితే రుయా అధికారులపై చర్యలు తప్పవు’ అని కలెక్టరు వెంకటేశ్వర్‌ హెచ్చరించినట్లు తెలిసింది.

రుయాస్పత్రిలో   ఫ్లెక్సీలు పెడితే చర్యలు

అధికారులకు తేల్చిచెప్పిన కలెక్టరు

హెచ్‌డీఎ్‌స సభ్యుడి తీరుపైనా ఆగ్రహం

తిరుపతి(వైద్యం), అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ‘తిరుపతి రుయాస్పత్రి నో ఫ్లెక్సీ జోన్‌ అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ పథకాల బోర్డులు తప్ప, ఇతర ఫ్లెక్సీలు, బోర్డులు పెడితే రుయా అధికారులపై చర్యలు తప్పవు’ అని కలెక్టరు వెంకటేశ్వర్‌ హెచ్చరించినట్లు తెలిసింది. హెచ్‌డీఎ్‌స వర్కింగ్‌ చైర్మన్‌గా చెప్పుకొనే సభ్యుడు బండ్ల లక్ష్మీపతి తీరుపైనా ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాలిలా ఉన్నాయి. మరోసారి లక్ష్మీపతి హెచ్‌డీఎస్‌ వర్కింగ్‌ చైర్మన్‌ అని చెలామణి అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రుయాస్పత్రిలో అధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమంలోనూ అతడికి ప్రాధాన్యం ఇవ్వరాదని, శిలాఫలకాలపైనా పేరు ఉండరాదని అధికారులకు స్పష్టంచేసినట్లు తెలిసింది. ఆస్పత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సహకరిస్తారనే కమిటీలో సభ్యులుగా తీసుకుంటామని, వారే ఇలా రోగులు, వైద్యులు ఇబ్బందులకు గురయ్యేలా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇతడి చర్యల వల్ల పాలకులకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. ఇలాంటి అంశాలపై పాలకులు సైతం దృష్టి పెట్టి ఆస్పత్రి అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అధికారులతో చర్చించినట్లు తెలిసింది. మరోసారి ఇటువంటివి చోటుచేసుంటే తక్షణమే రుయా అధికారులు తన దృష్టికి తీసుకురావాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Updated Date - Oct 26 , 2024 | 07:13 AM