Share News

విపరీతంగా పెరిగిన ఫోన్‌ వాడకం

ABN , Publish Date - Oct 27 , 2024 | 01:19 AM

నిద్రపోయేటప్పుడు ముట్టుకునే చివరి వస్తువు.. నిద్ర లేవగానే ముట్టుకునే తొలి వస్తువు.. సెల్‌ఫోన్‌.వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌కు అనుసంధానమైపోయారు. కొందరైతే రోజులో ఏకంగా 8 గంటలకు పైగా సెల్‌ఫోన్‌ చూడ్డానికే సమయాన్ని కేటాయిస్తున్నారు.అయితే ఫోన్‌ను అధికంగా వినియోగించడం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది.స్మార్ట్‌ ఫోన్‌ని కౌమార దశలో ఉండేవారు వినియోగించడంపై కొరియాలోని హన్యాంగ్‌ యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ బృందం పరిశోధన చేపట్టింది.50వేల కంటే ఎక్కువ మందిపై అధ్యయనం చేశారు.రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్‌ వాడడం వల్ల ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు పెరగడంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువవుతోందని తేలింది.

  విపరీతంగా పెరిగిన ఫోన్‌ వాడకం

చిత్తూరు, ఆంధ్రజ్యోతి

నిద్రపోయేటప్పుడు ముట్టుకునే చివరి వస్తువు.. నిద్ర లేవగానే ముట్టుకునే తొలి వస్తువు.. సెల్‌ఫోన్‌.వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌కు అనుసంధానమైపోయారు. కొందరైతే రోజులో ఏకంగా 8 గంటలకు పైగా సెల్‌ఫోన్‌ చూడ్డానికే సమయాన్ని కేటాయిస్తున్నారు.అయితే ఫోన్‌ను అధికంగా వినియోగించడం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది.స్మార్ట్‌ ఫోన్‌ని కౌమార దశలో ఉండేవారు వినియోగించడంపై కొరియాలోని హన్యాంగ్‌ యూనివర్శిటీ మెడికల్‌ సెంటర్‌ బృందం పరిశోధన చేపట్టింది.50వేల కంటే ఎక్కువ మందిపై అధ్యయనం చేశారు.రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్‌ వాడడం వల్ల ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు పెరగడంతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువవుతోందని తేలింది.

ఎంతసేపు వాడామో తెలుసుకోవచ్చు

సెల్‌ఫోన్‌ను ఎంత సేపు వినియోగించామనే సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే.. డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ అండ్‌ పేరెంటల్‌ కంట్రోల్స్‌ అని ఉంటుంది. కొన్ని ఫోన్లలో డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ అనే ఆప్షన్‌ మాత్రమే ఉంటుంది. ఈ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే ఓపెన్‌ చేసిన రోజు ఎంతసేపు ఫోన్‌ను వినియోగించాం, అందులో ఏయే యాప్స్‌కు ఎంత సమయం కేటాయించామన్నది కనిపిస్తుంది. వ్యూ యాక్టివిటీ డీటైల్స్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా మరింత సమాచారం కూడా వస్తుంది.

అధికంగా వాడితే ఇబ్బందులే

స్ర్కీన్‌ చూసే సమయం పెరగడంతో శారీరక శ్రమ తగ్గి బరువు పెరుగుతారు.

రాత్రిళ్లు ఎక్కువ సమయం మేల్కోవడంతో నిద్రలేమి,వినికిడి సమస్యలు ఏర్పడుతాయి

కళ్లు పొడిబారడం, తలనొప్పి, పార్శ్యపు నొప్పి, దృష్టిలోపం రావచ్చు

బైక్‌ నడుపుతూ ఫోన్‌ మాట్లాడటంతో మెడనొప్పి వస్తుంది.

ఫోన్‌ వాడకాన్ని తగ్గించుకోవచ్చు

ఫోన్‌ను ఎంతసేపు వాడుతున్నారో చెక్‌ చేసుకుంటే రోజురోజుకు మెల్లగా తగ్గించవచ్చు.

హాబీ్‌సపై దృష్టి పెట్టడం ద్వారా సెల్‌ను కాసేపు పక్కన పెట్టొచ్చు.

ఫోన్‌లో అలారం పెట్టడం వల్ల ఉదయం లేవగానే సోషల్‌ మీడియా యాప్స్‌ వంటివి చూస్తూ ఉండిపోతారు. అందుకే అలారం వేరే పరికరంలో పెట్టుకుంటే మేలు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌ సహా ఉద్యోగ సంబంధ మెయిల్స్‌కు రిప్లై ఇవ్వడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయిస్తే మేలు.

మధ్యాహ్నం నిద్రకు ముందు, భోంచేసేటప్పుడు.. ఫోన్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు.

మద్యపానం తరహా బానిసత్వమే

కొవిడ్‌ సమయంలో ఖాళీగా ఉండి పెద్దలు సెల్‌ఫోన్‌ వాడితే, పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో సెల్‌కు బానిసలు అయ్యారు. యువత ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడడం, పోర్న్‌ వీడియోలు చూడడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. విద్యార్థులు ఎక్కువ సేపు సెల్‌ వాడితే చదువు మీద ధ్యాస తగ్గిపోయి చిరాకు, కోపం, విసుగు వస్తాయి.నిద్ర కూడా సరిగా పట్టదు. సెల్‌ఫోన్‌ అధికంగా వినియోగించడం కూడా మద్యపానం తరహా వ్యసనం లాంటిదే. వెంటనే అలవాటును మానుకోలేరు. కొద్దికొద్దిగా మానుకుంటూ రావాలి. చిరాకు, కోపం అధికంగా వస్తున్నప్పుడు మానసిక వైద్యుల్ని సంప్రదించాలి.చిన్న పిల్లల విషయానికొస్తే అసలు ఫోన్‌ ఇవ్వకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి. పెద్దలు కూడా 3 గంటల కంటే ఎక్కువసేపు ఫోన్‌ వాడుతున్నారంటే బానిస అయినట్లే అని గ్రహించి, అలవాటును తగ్గించుకోవాలి.

-డాక్టర్‌ దినేష్‌, మానసిక వైద్యులు,

ప్రీతమ్‌ హాస్పిటల్‌, చిత్తూరు

డ్రై ఐస్‌, సైట్‌ పెరగడం వంటి ప్రమాదాలు

సెల్‌ఫోన్‌, సిస్టమ్‌ ఎక్కువ వాడడం వల్ల కంటి రెటీనా దెబ్బ తింటుంది. ఎక్కువగా వినియోగించేవారు కళ్లకు ఇబ్బంది లేకుండా బ్లూఫిల్టర్‌ అద్దాల్ని వాడితే రేస్‌ రెటినా వరకు వెళ్లకుండా అద్దాలు కంట్రోల్‌ చేస్తాయి. సెల్‌ఫోన్‌ దగ్గరగా పెట్టుకుని చూస్తే సైట్‌ వచ్చే ప్రమాదముంది. అలాగే వయోటిక్‌ షిఫ్ట్‌ జరిగి మైనస్‌ పవర్‌ పెరుగుతుంది. అంటే ఉన్న సైట్‌ మరింత అధికమవుతుంది. సెల్‌ఫోన్‌ రోజుకు 30-45 నిమిషాలకు మించి చూడకూడదు. ముఖ్యంగా లైట్లన్నీ ఆపేసి సెల్‌ఫోన్‌ చూడడం మరింత ప్రమాదకరం. ఎక్కువగా చూడడంతో ‘డ్రై ఐస్‌’ వస్తాయి. దాంతో కళ్లు రెడ్‌గా మారి నీళ్లు కారుతాయి. వెలుగు చూడలేం. ఫ్యాన్‌ కింద కూర్చుంటే ఇరిటేషన్‌ వస్తుంది. ఎక్కువ సేపు సిస్టమ్‌ వాడే వారి కోసం 20:20:20 రూల్‌ను ఫాలో అవమని చెబుతుంటాం. 20 నిమిషాలకోసారి పనిలో గ్యాప్‌ తీసుకుని 20 అడుగుల దూరంలో ఏదో వస్తువును 20 సెకండ్ల పాటు ఫోకస్‌ చేసి చూడాలి. ఇంకొందరు పనిలో పడి కళ్లు మూయడం మర్చిపోతుంటారు. గంటకోసారి అలారం పెట్టుకుని మరీ రెండు నిమిషాల పాటు కళ్లు పూర్తిగా మూయాలి.

-డాక్టర్‌ గీతా అనూష, కంటి వైద్య నిపుణులు,

సంజీవని జనరల్‌ సర్జరీ అండ్‌ ఐ క్లినిక్‌, చిత్తూరు

Updated Date - Oct 27 , 2024 | 01:19 AM