Share News

తిరుమల ఘాట్‌లో ఇనుపకంచె ఏర్పాటు

ABN , Publish Date - Nov 17 , 2024 | 02:17 AM

తిరుమలలో శనివారం కూడా జల్లులు పడ్డాయి. వారం రోజులుగా పడుతూనే ఉంది.

తిరుమల ఘాట్‌లో ఇనుపకంచె ఏర్పాటు

తిరుమల, నవంబరు16(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శనివారం కూడా జల్లులు పడ్డాయి. వారం రోజులుగా పడుతూనే ఉంది. దీంతో తిరుమల రెండో ఘాట్‌రోడ్డు ప్రమాదకరంగా మారింది. పలు ప్రాంతాల్లో చిన్నపాటి రాళ్లు రోడ్డుపై పడుతున్నాయి. 8వ కిలోమీటరు వద్ద కొండచరియలు ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో ఇంజినీరింగ్‌ సిబ్బంది సిమెంట్‌ వేసి ఇనుపకంచెను ఏర్పాటు చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడేందుకు అవకాశమున్న ప్రాంతాలపై టీటీడీ అధికారులు నిఘా పెట్టారు.

Updated Date - Nov 17 , 2024 | 02:17 AM