Share News

ISRO: ఇస్రో విజయాశ్వం మరోసారి విజయం

ABN , Publish Date - Dec 31 , 2024 | 02:00 AM

ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ మరోసారి విజయకేతనం ఎగురవేసింది.

ISRO: ఇస్రో విజయాశ్వం మరోసారి విజయం
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి.. రెండో దశ.. - నాలుగో దశ

సూళ్లూరుపేట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ మరోసారి విజయకేతనం ఎగురవేసింది. విభిన్న ప్రయోగాలకు పీఎ్‌సఎల్వీ వాహక నౌక బ్రహ్మాస్త్రంలా మారింది. సోమవారం రాత్రి 10 గంటల 15 సెకన్లకు ప్రయోగించిన పీఎ్‌సఎల్వీ-సీ 60 విజయవంతమైంది. ఈ రాకెట్‌ ద్వారా స్పాడెక్స్‌ జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా విడిచిపెట్టడంతో షార్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. బుడిబుడి అడుగుల ప్రస్థానంలో ప్రారంభమైన పీఎ్‌సఎల్వీ నేడు విదేశీ ఉపగ్రహాలనూ సునాయసంగా అంతరిక్షంలోకి చేర్చేస్థాయికి చేరింది. ఇస్రోకు పీఎ్‌సఎల్వీ రామబాణంగా మారింది. ఒకేసారి 10, 20, 38, 104 ఉపగ్రహాలను విజయవంతంగా చేర్చి ప్రపంచ స్థాయిలో పేరు కూడా పీఎ్‌సఎల్వీకే దక్కింది. ఇప్పటి వరకు షార్‌ నుంచి 62 పీఎ్‌సఎల్వీ ప్రయోగాలు చేపట్టగా కేవలం రెండు మాత్రమే విఫలం చెందాయి. ఈ రాకెట్‌ ద్వారా 505 ఉపగ్రహాలను ప్రయోగించగా ఇందులో 433 విదేశీ.. 70 స్వదేశీ ఉపగ్రహాలు, పలు వర్సిటీలకు చెందిన 13 బుల్లి ఉపగ్రహాలు ఉన్నాయి.

తిరుమలలో పీఎ్‌సఎల్వీ-సీ60 నమూనాకు పూజలు

తిరుమల/సూళ్లూరుపేట, డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): శ్రీహరికోట షార్‌ నుంచి ప్రయోగించనున్న పీఎ్‌సఎల్వీ-సీ60 నమూనాకు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు ఇలా తిరుమల రావడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఇస్రో డైరెక్టర్‌ దినే్‌షకుమార్‌ సింగ్‌, పిన్సిపల్‌ సెక్రటరీ యశోద, ఎన్‌ఏఆర్‌ఎల్‌ డైరెక్టర్‌ అమిత్‌కుమార్‌ పాత్ర, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సగుప్తా బృంద సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో నమునాతో ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.


మరోవైపు, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని సోమవారం ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ దర్శించుకొని పూజలు చేశారు. ఆస్థాన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్‌ ప్రసన్నలక్ష్మి, షార్‌ గ్రూపు డైరెక్టర్‌ గోపికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 02:01 AM