భక్తుల్లేక బోసిపోయిన కాణిపాకం
ABN , Publish Date - Dec 03 , 2024 | 02:19 AM
తుఫాను కారణంగా భక్తుల రాక తగ్గడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం సోమవారం బోసిపోయింది.
తుఫాన్ ఎఫెక్ట్
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తుఫాను కారణంగా భక్తుల రాక తగ్గడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం సోమవారం బోసిపోయింది. మూడ్రోజులుగా ముసురు కారణంగా ఆదివారం వరకు వరసిద్ధుడి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రస్తుతం ఆలయ పరిసర ప్రాంతాల నుంచి మాత్రమే స్వామి దర్శనార్థం వస్తుండటంతో వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ఆలయానికి సుమారు 20 వేలకు తగ్గకుండా వస్తారు. ప్రత్యేకమైన రోజుల్లో అయితే 30-50వేల మంది వరకు స్వామిని దర్శించుకుంటారు.