Share News

Shobha-కార్తీక శోభ

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:34 AM

కార్తీక మాసం తొలి సోమవారం జిల్లాలోని శైవాలయాలు కిటకిటలాడాయి. ఆలయాల్లోని కోనేర్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ పరిసరాల్లో మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు తోడు అయ్యప్ప భక్తుల తాకిడితో తిరుపతిలోని కపిలతీర్థం కళకళలాడింది.

Shobha-కార్తీక శోభ
శ్రీకాళహస్తీశ్వరాలయం ఆవరణలోని శివయ్య గోపురం వద్ద దీపారాధన

ఫ శైవాలయాలకు పోటెత్తిన భక్తజనం

తిరుపతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం తొలి సోమవారం జిల్లాలోని శైవాలయాలు కిటకిటలాడాయి. ఆలయాల్లోని కోనేర్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ పరిసరాల్లో మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు తోడు అయ్యప్ప భక్తుల తాకిడితో తిరుపతిలోని కపిలతీర్థం కళకళలాడింది. శ్రీకాళహస్తీశ్వరాలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. అనుబంధ శివాలయాల్లోనూ పూజా కైంకర్యాలు జరిపి దీపాలు వెలిగించారు. సూళ్లూరుపేటలోని నాగేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం చుట్టూ మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మన్నారు పోలూరు సంతానేశ్వర స్వామి ఆలయం, కల్యాణేశ్వర స్వామి ఆలయాల్లోనూ భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. తిరుచానూరులోని యోగిమల్లేశ్వర స్వామి ఆలయంలోనూ కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Nov 05 , 2024 | 01:34 AM