Share News

పంతం వీడి.. వస్త్రాలు ధరించి..

ABN , Publish Date - Nov 08 , 2024 | 02:33 AM

దిగంబరంగానే శివుడ్ని దర్శించుకుంటానని గురువారం ఉదయమంతా ఆగడం చేసిన అఘోరి.. సాయంత్రానికి పంతం వీడి వస్త్రాలు ధరించి ఆలయానికి వచ్చారు.

పంతం వీడి..   వస్త్రాలు ధరించి..

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న అఘోరి

శ్రీకాళహస్తి/బుచ్చినాయుడు కండ్రిగ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): దిగంబరంగానే శివుడ్ని దర్శించుకుంటానని గురువారం ఉదయమంతా ఆగడం చేసిన అఘోరి.. సాయంత్రానికి పంతం వీడి వస్త్రాలు ధరించి ఆలయానికి వచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద దిగంబరంగా వెళ్లిని అఘోరిని అధికారులు అడ్డుకున్నారు. వస్త్రాలు ధరిస్తేనే ఆలయంలోకి అనుమతిస్తామని స్పష్టంచేశారు. దీంతో ఆమె పెట్రోల్‌ పోసుకుని ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పగా.. పోలీసులు అనునయించి తమిళనాడు పరిధిలోని ఆరంబాకంలో వదిలిపెట్టారు. మళ్లీ ఆమె శ్రీకాళహస్తికి బయలుదేరారు. సాయంత్రం బుచ్చినాయుడు కండ్రిగ వద్దకు ఆమె కారు చేరుకోగా.. పోలీస్‌ స్టేషన్‌ వద్ద సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐ విశ్వనాథ నాయుడు సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. ఆమె కారును తనిఖీ చేశారు. అఘోరి ఒంటిపై బట్టలు లేకపోవడంతో శాలువా ఇచ్చి కట్టుకోమని ఒప్పించారు. అనంతరం అఘోరిని దించి కారు తనిఖీ చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి తాను వస్త్రాలు ధరించి వెళతానని ఆమె చెప్పడంతో బందోబస్తుతో పోలీసులు ఆమెను తీసుకెళ్లి, స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించారు.

Updated Date - Nov 08 , 2024 | 02:33 AM