చెన్నైకు ఇసుక తరలిస్తున్న లారీ సీజ్
ABN , Publish Date - Oct 31 , 2024 | 02:17 AM
చెన్నైకి ఇసుక తరలించడానికి సిద్ధంగా ఉన్న 14 చక్రాల లారీని, ఎక్స్‌కవేటర్‌ను పోలీసులు సీజ్ చేశారు. రేణిగుంట మండలం ఎస్‌ఆర్‌పట్టెడ వద్ద 14 చక్రాల లారీలో ఎక్స్‌కవేటర్ సాయంతో ఇసుక నింపి చెన్నైకు తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
ఎక్స్‌కవేటర్‌నూ స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు
రేణిగుంట, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): చెన్నైకి ఇసుక తరలించడానికి సిద్ధంగా ఉన్న 14 చక్రాల లారీని, ఎక్స్‌కవేటర్‌ను పోలీసులు సీజ్ చేశారు. రేణిగుంట మండలం ఎస్‌ఆర్‌పట్టెడ వద్ద 14 చక్రాల లారీలో ఎక్స్‌కవేటర్ సాయంతో ఇసుక నింపి చెన్నైకు తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గాజులమండ్యం సీఐ మురళీకృష్ణ, సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళుతుండగా.. ఎస్‌ఆర్‌పట్టెడ సమీపంలో పోలీసు వాహనాలను గమనించిన అక్రమ రవాణాదారులు పరారయ్యారు. దీంతో పట్ట కప్పి ఇసుకతో నింపిన లారీని, ఎక్స్‌కవేటర్‌ను పోలీసులు గాజులమండ్యం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. బుధవారం మధ్యాహ్నం కేసు నమోదు చేశారు. తూకివాకానికి చెందిన ఓ నాయకుడు, అతడి అనుచరులు, ఎస్‌ఆర్‌పట్టెడకు చెందిన ఓ వ్యక్తితో కలిసి చెన్నైలోని బడా బిల్డర్ల వద్ద ఒప్పందం కుదుర్చుకుని లారీ ఇసుకను రూ.1.20లక్షలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పొరుగు రాష్ట్రాలకు ఇసుకను విక్రయించిన వారే ఇప్పుడూ కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. సీజ్ చేసిన లారీ, ఎక్స్‌కవేటర్‌పై కేసులు నమోదు చేయొద్దంటూ గాజులమండ్యం పోలీసులపై ఓ నాయకుడు ఒత్తిడి చేసినట్టు సమాచారం. కాగా గాజులమండ్యం పోలీసులు లారీ, ఎక్స్‌కవేటర్‌ను సీజ్ చేసినట్టు మీడియాకు తెలపకపోవడం గమనార్హం.