మినీ కేంద్రాలను మెయిన్‌గా మార్చాలి
ABN , Publish Date - Nov 17 , 2024 | 02:00 AM
మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ఆందోళన
తిరుపతి(కలెక్టరేట్), నవంబరు 16(ఆంధ్రజ్యోతి): మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శనివారం వర్షంలోనే ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ.. మినీ అంగన్వాడీ కేంద్రాలకు హెల్పర్ ఒక్కరే ఉండటంతో వారిపై పనిభారం పెరిగిపోతుందన్నారు. వారికి మెయిన్ వర్కర్లుగా పదోన్నతి ఇవ్వాలని జీవో ఉన్నా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలుచేయాలని కోరారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మలీల, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, శ్యామల, ఇంద్రాణి, సీఐటీయూ నుంచి మునిరాజ, లక్ష్మి, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.