ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేయండి
ABN , Publish Date - Nov 17 , 2024 | 02:13 AM
హిందువుల మనోభావాలకు విరుద్దంగా జూపార్క్ రోడ్డులో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్‌కు అనుమతులు వెంటనే రద్దు చేయాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి, రాయల్ పీపుల్ ఫ్రంట్‌ల అధ్యక్షులు తుమ్మా ఓంకార్, రెడ్డిశేఖర్‌రాయల్ డిమాండ్ చేశారు.
హిందూ ధర్మ పరిరక్షణ సంఘాల డిమాండ్
తిరుపతి(లీలామహల్), నవంబరు16(ఆంధ్రజ్యోతి): హిందువుల మనోభావాలకు విరుద్దంగా జూపార్క్ రోడ్డులో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్‌కు అనుమతులు వెంటనే రద్దు చేయాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి, రాయల్ పీపుల్ ఫ్రంట్‌ల అధ్యక్షులు తుమ్మా ఓంకార్, రెడ్డిశేఖర్‌రాయల్ డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు వేర్వేరుగా మాట్లాడారు. 2021లో వైసీపీ ప్రభుత్వ టీటీడీ పవిత్రతను దెబ్బతీయడానికి జూపార్క్‌కు ఆనుకుని ఉన్న దేవలోక్‌లో 60 ఎకరాల్లో 20 ఎకరాలు ముంతాజ్ (ఒబెరాయ్ గ్రూపు) హోటల్‌కు కేటాయించిందన్నారు. 100 విల్లాలతోపాటు మద్యం, మాంసం, స్పా, స్విమ్మింగ్‌ఫూల్ లాంటి విదేవీ సంస్కృతిని పెంపొందించే ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. ఈ నెల 18న జరగనున్న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి హోటల్‌కు కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశాల్లో సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లె కిరణ్, రమాదేవి, మల్లీశ్వరి, కేశవులు, నీలకంఠ, ధనుంజయ్, రాయల్ పీపుల్ ఫ్రంట్ సభ్యులు హేమంత్‌కుమార్, వేణురాయల్, పవన్‌కుమార్‌రాయల్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.