2 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:31 AM
ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 2వ తేది వరకు జాతీయరహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీటీసీ నిరంజన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు సిటీ, జనవరి 16: ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 2వ తేది వరకు జాతీయరహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీటీసీ నిరంజన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ‘యువశక్తి ద్వారా సామాజిక మార్పు’ నినాదంతో మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బస్సు, లారీ, ఆటో డ్రైవర్లకు, కళాశాల విద్యార్థులకు, ముఖ్యమైన కూడళ్ళలో సమావేశాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తామన్నారు.