Share News

‘సకుర’ పోటీల్లో మన నమూనాలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:43 AM

అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌ దేశం సకురలో జరిగిన సైన్సు పోటీల్లో మన జిల్లా నుంచి రెండు నమూనాలు ప్రదర్శితమయ్యాయి. టూ వీలర్‌ బ్యాక్‌ రెస్ట్‌ ఫర్‌ సైట్‌ సీట్‌ ఉమెన్‌.. పది నుంచి 15 రోజులపాటు కూరగాయలు తాజాగా ఉండేలా ‘గార్లిక్‌ బ్యాగ్‌’ నమూనాలవి.

‘సకుర’ పోటీల్లో మన నమూనాలు
సైన్సు ప్రయోగంపై విద్యార్థికి శిక్షణ ఇస్తున్న జిల్లా అధికారి రమణ

ఒకరు సైన్సు పోటీలో నమూనాలను అంతర్జాతీయ ప్రదర్శనకు తీసుకువెళ్లేలా కృషి చేశారు. ఇంకొకరు సైన్సు ప్రదర్శనలో విద్యార్థులను ‘ఇన్‌స్పైర్‌’ చేశారు. మరొకరు పాఠ్యపుస్తకాల కల్పనలో భాగస్వామిగా.. అర్థమయ్యే రీతిలో రచన చేసేలా దోహదపడ్డారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెంచడానికి వీరు చేసిన కృషిని, వారి మాటల్లోనే తెలుసుకుందాం.

- చిత్తూరు (సెంట్రల్‌)

అంతర్జాతీయ స్థాయిలో జపాన్‌ దేశం సకురలో జరిగిన సైన్సు పోటీల్లో మన జిల్లా నుంచి రెండు నమూనాలు ప్రదర్శితమయ్యాయి. టూ వీలర్‌ బ్యాక్‌ రెస్ట్‌ ఫర్‌ సైట్‌ సీట్‌ ఉమెన్‌.. పది నుంచి 15 రోజులపాటు కూరగాయలు తాజాగా ఉండేలా ‘గార్లిక్‌ బ్యాగ్‌’ నమూనాలవి. వీటి పేటెంట్‌ హక్కులను జపాన్‌ ప్రభుత్వం తీసుకుంది. గతేడాది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలో మన జిల్లా విద్యార్థుల నమూనాలకు బహుమతులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇన్‌స్పైర్‌ పోటీల్లో జిల్లా నుంచి అత్యధిక నామినేషన్లు చేయించి దేశంలోనే జిల్లాను 10 స్థానాల్లోపు ఒకటిగా నిలబెట్టడం జిల్లా సైన్స్‌ అఽధికారిగా సంతృప్తి నిస్తోంది. ‘ప్రధానమంత్రి పే చర్చా’ కార్యక్రమంలో పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యార్థులను నేరుగా ప్రధాని మోదీతో మాట్లాడించేలా ప్రోత్సహించాను. రీజనల్‌, రాష్ట్ర స్థాయి సైన్సు పోటీల్లోనూ విద్యార్థులు పాల్గొనేలా చేయడం నాకు సంతృప్తి నిచ్చింది. - ఆర్‌వీ రమణ, జిల్లా సైన్స్‌ అధికారి

విద్యార్థులతో స్నేహితుడిగా...

ఉపాధ్యాయుడిగా కాకుండా విద్యార్థులతో స్నేహితుడిగా మెలిగినప్పుడే వారిలోని ప్రతిభను వెలికి తీయగలం. గత రెండు సంవత్సరాలుగా అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ద్వారా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్‌ ప్రదర్శనల్లో విద్యార్థులు పాల్గొనేలా చేశాను. బహుమతులు తెచ్చి పెట్టేలా వారితో నమూనాలు చేయించాను. 2021 రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ పోటీల్లో మా పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించారు. గత 22 సంవత్సరాలు నా సొంత డబ్బులతో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేస్తున్నా. ప్రత్యేక దినాల్లో విద్యార్థులకు స్పెషల్‌ వంటకాలు చేయించి వడ్డించే వాడిని. సేవా కార్యక్రమాలు చేయడం, పేద విద్యార్థులకు సాయం చేయడం, వారిని మంచి మార్గంలో నడిపించడం అనేది టీచరుగా ఉన్నందుకే సాధ్యపడింది. అందుకే నేను టీచర్‌నని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నా. - తులసీరాము, ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌, జడ్పీహెచ్‌ఎ్‌స, కీలపట్ల, గంగవరం మండలం

రచనలతో విద్యార్థులను ఆకర్షింప చేయాలి

బోధనతోనే కాకుండా రచనలతోనూ విద్యార్థులను ఆకర్షింప చేయాలి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సరళమైన రీతిలో పాఠ్యపుస్తకాలను అనువదించడం, రచన చేయడం నాకు సంతృప్తి నిస్తోంది. భౌతిక, రసాయన శాస్త్రాల పాఠ్యపుస్తకాలను, ఓపెన్‌ స్కూల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకాలను రచన చేశాను. తొమ్మిదవ తరగతి ఫిజికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకాన్ని రచన చేయడంలో భాగస్వామిని అయ్యా. ఉపాధ్యాయ కరదీపి రచనలు చేశాను. విద్యార్థులకు చెకుముకి టాలెంట్‌ టెస్టు, క్విజ్‌ పోటీలకు ప్రోత్సహించడం, తిరుపతి రేడియో కేంద్రం ద్వారా నాతో పాటు విద్యార్థుల ప్రసంగాలు, కవితలు చదివించడం ఆనందంగా ఉంది. ఎన్నో జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందా. ప్రయోగాలు చేయించడంలో గైడ్‌ టీచర్‌గా విద్యార్థుల్లోని నైపుణ్యం వెలికి తీయడం నా అదృష్టంగా భావిస్తున్నా. - జీకే షంషీర్‌ ఖాన్‌, ఫిజికల్‌ సైన్స్‌, జడ్పీహెచ్‌ఎ్‌స, టేకుమంద, బంగారుపాళ్యం మండలం

Updated Date - Sep 05 , 2024 | 08:14 AM