అందాల పోటీల్లో మెరిసిన పాదిరేడు అమ్మాయి
ABN , Publish Date - Dec 27 , 2024 | 03:28 AM
జాతీయ స్థాయి అందాల పోటీలు-2024లో వడమాలపేట మండలం పాదిరేడుకు చెందిన అల్లూరు సుజన మిస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ అవార్డు దక్కించుకున్నారు.
జాతీయ స్థాయి అందాల పోటీలు-2024లో వడమాలపేట మండలం పాదిరేడుకు చెందిన అల్లూరు సుజన మిస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ అవార్డు దక్కించుకున్నారు. ఈ నెల 21న న్యూఢిల్లీలోని పశ్చిమ విహార్ హోటల్లో జాతీయ స్థాయి అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సుజన ప్రతిభ కనబరిచి మిస్ ఇండియా-2024 ఫస్ట్ రన్నర్‌పగా నిలిచారు. కలికిరి జేఎన్‌టీయూఏలో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసిన తనకు కాగ్నిజెంట్ సంస్థలో ఉద్యోగ అవకాశం లభించినట్లు ఆమె చెప్పారు. తల్లిదండ్రులు విశ్రాంత ఉపాధ్యాయురాలు పార్వతి, సెరికల్చర్ ఆఫీసర్ సుబ్రమణ్యం ప్రోత్సాహంతోనే తనకు ఈ అవార్డు దక్కిందన్నారు. ప్రస్తుతం పుత్తూరులో నివాసం ఉంటున్నారు.
- పుత్తూరు అర్బన్, అంధ్రజ్యోతి