Share News

Pawan Kalyan: మరో ఉద్యమానికి సిద్ధం.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..

ABN , Publish Date - Oct 02 , 2024 | 09:59 PM

వారాహి సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయాశ్చిత దీక్షను విరమించిన తర్వాత వారాహి డిక్లరేషన్ గురించి వివరించారు. తిరుపతిలో వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు..

Pawan Kalyan: మరో ఉద్యమానికి సిద్ధం.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..
Pawan Kalyan

వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు వారాహి యాత్ర చేపట్టిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు మరో సంకల్పం తీసుకున్నారు. తిరుపతిలో గురువారం నిర్వహించే వారాహి సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయాశ్చిత దీక్షను విరమించిన తర్వాత వారాహి డిక్లరేషన్ గురించి వివరించారు. తిరుపతిలో వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు అంకితం చేయనున్నట్లు పవన్ తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాలను ప్రతిధ్వనించడమే లక్ష్యంగా వారాహి సభను నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 14 నెలల క్రితం వారాహి యాత్రను మొదలుపెట్టినప్పుడు దానిని కేవలం ఉద్యమంగా ప్రారంభించలేదని, సమస్యలకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా వారాహి యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నిరంకుశ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో.. రాష్ట్ర ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ వారాహి ముందుకు కదిలిందన్నారు. న్యాయం కోసం పోరాడాలనే ధైర్యాన్ని, సంకల్పాన్ని వారాహి యాత్ర ప్రజల్లో కల్పించిందన్నారు. వారాహి కేవలం యాత్ర మాత్రమే కాదని.. మన రాష్ట్రాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలనే నిబద్ధతను సూచిస్తుందన్నారు.


సనాతన ధర్మ పరిరక్షణ కోసం

ప్రస్తుతం వారాహి మరో పెద్ద లక్ష్య సాధన కోసం తిరిగి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సనాతన ధర్మ రక్ష బోర్డ్ ఏర్పాటును కోరుకునే లక్షలాది మంది స్వరాన్ని వినిపించడమే లక్ష్యంగా తిరుపతిలో వారాహి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాచీన సంప్రదాయాలు, విలువలను పరిరక్షించాలనే నిబద్ధతకు నిదర్శనంగా రేపటి వారాహి సభ నిలుస్తుందన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే డిమాండ్‌తో డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరితో కలిసి నడుస్తామని వాగ్దానం చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.


అందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా..

సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. హైందవ మతాన్ని, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోకుండా.. దేవాలయాల నిర్వహణ, పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా వినిపిస్తోంది. దీనికోసం పలువురు స్వామీజీలు ప్రభుత్వాలకు విన్నవించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన ప్రజల సహకారంతో ఈ డిమండ్‌ను తెరపైకి తీసుకువచ్చింది. హైందవ సంఘాలు సైతం పవన్ కళ్యాణ్ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాటి వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలు మాట్లాడబోతున్నారు.. డిక్లరేషన్‌లో ఏమి పొందుపర్చారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 02 , 2024 | 09:59 PM