Share News

30నుంచి కానిస్టేబుల్‌ అఽభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు: ఎస్పీ

ABN , Publish Date - Dec 28 , 2024 | 01:01 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షలో ఎంపికైన వారికి దేహదారుఢ్య పరీక్షలు ఈనెల 30 నుంచి వచ్చే నెల పదో తేదీవరకు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.

30నుంచి కానిస్టేబుల్‌ అఽభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు: ఎస్పీ

చిత్తూరు అర్బన్‌, డిసెంబరు 27 (ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షలో ఎంపికైన వారికి దేహదారుఢ్య పరీక్షలు ఈనెల 30 నుంచి వచ్చే నెల పదో తేదీవరకు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. శుక్రవారం రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే అధికారులతో పోలీసు అతిథి గృహంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సమీక్షించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఉద్యోగం పొందాలనే ఒత్తిడిలో అభ్యర్థులు ఉంటారని, వారితో మర్యాదగా, సహనంతో వ్యవహరించాలన్నారు. అభ్యర్థులు తమతోపాటు అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లతోపాటు ఓ సెట్‌ జిరాక్స్‌కాపీలను తేవాలని చెప్పారు. కాల్‌ లెటర్‌లో తెలిపిన స్కోర్‌కార్డు, స్టేజ్‌-1 అప్లికేషన్‌, స్టేజ్‌-2 అప్లికేషన్‌ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. కాల్‌ లెటర్‌లో తెలిపిన తేదీల్లో ఉదయం ఐదు గంటల సమయానికి హాజరుకావాలని స్పష్టం చేశారు. అభ్యర్థికి మాత్రమే మైదానంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

పోలీసు కానిస్టేబుల్‌ భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎస్పీ తెలిపారు. ఎవరైనా ఉద్యోగం తీసిస్తామని చెబితే అలాంటి వారిపై 112 లేదా పోలీసు వాట్సాప్‌ 94409 00005 నెంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Dec 28 , 2024 | 01:01 AM