Share News

గుంతల్లేని రోడ్లే ధ్యేయం

ABN , Publish Date - Nov 03 , 2024 | 02:56 AM

రోడ్డుప్రమాదాలను అరికట్టడంలో భాగంగా జిల్లాలోని రహదారులను గుంతల రహితం చేయడమే ధ్యేయంగా ముందుకెళుతున్నామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు.

గుంతల్లేని రోడ్లే ధ్యేయం
కంకర, తారు వేసి రోడ్డుపై గుంతలు పూడ్చే పనులను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే జగన్మోహన్‌ తదితరులు

జిల్లాలో రూ.6.72కోట్లతో 482కి.మీ బీటీ రోడ్లకు మరమ్మతు పనులు

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

చిత్తూరు అర్బన్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): రోడ్డుప్రమాదాలను అరికట్టడంలో భాగంగా జిల్లాలోని రహదారులను గుంతల రహితం చేయడమే ధ్యేయంగా ముందుకెళుతున్నామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌ వద్ద స్టేట్‌హైవే బీటీ రోడ్డుపై ఉన్న గుంతలను మరమ్మతు చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, మేయర్‌ అముదతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులోభాగంగా రూ. 5.42 కోట్లతో 482 కిలోమీటర్ల బీటీ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి రూ. 19 లక్షలతో 12.5 కిమీ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సీఎం చంద్రబాబు ఈ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మాజీ మేయర్‌ కఠారి హేమలత, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసులు, డీఈ నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 02:56 AM