Share News

నేడు, రేపు మున్సిపల్‌ టీచర్లకు పదోన్నతి కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Dec 22 , 2024 | 02:03 AM

మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల పదోన్నతికి ఆది, సోమవారాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు.

నేడు, రేపు మున్సిపల్‌ టీచర్లకు పదోన్నతి కౌన్సెలింగ్‌

చిత్తూరు సెంట్రల్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల పదోన్నతికి ఆది, సోమవారాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. సీనియారిటీ జాబితా ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్లు.. హెచ్‌ఎంలుగా, సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సీనియారిటీ జాబితాను డీవైఈవో, ఎంఈవోల మెయిల్‌కు పంపామన్నారు. గ్రేడ్‌2 హెచ్‌ఎంలకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని స్కూల్‌ అసిస్టెంట్‌ (బయాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, సోషల్‌, ఇంగ్లీ్‌ష)లకు, మున్సిపల్‌ పరిధిలోని స్కూల్‌ అసిస్టెంట్లకు (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌) సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. టీచర్లు సర్వీసు పుస్తకం, కుల, విద్యార్థుల, ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు, డీఎస్సీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీ, ట్రాన్స్‌ఫర్‌ అయిన కాపీలు తీసుకుని కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 02:03 AM