నేటి ప్రయోగానికి పీఎ్‌సఎల్వీ-సీ 60 రాకెట్ సిద్ధం
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:16 AM
షార్ నుంచి 99వ ప్రయోగం. పీఎ్‌సఎల్వీ ప్రయోగాల్లో ఇది 62వది. సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 60 రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్‌కు చెందిన 440 కిలోల బరువు గల స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు.
షార్ నుంచి 99వ ప్రయోగం. పీఎ్‌సఎల్వీ ప్రయోగాల్లో ఇది 62వది. సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎ్‌సఎల్వీ-సీ 60 రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్‌కు చెందిన 440 కిలోల బరువు గల స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఇప్పటికే షార్‌లో పీఎ్‌సఎల్వీ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఫెసిలిటీ (పీఐఎ్‌ఫ)లో రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులు పూర్తిచేసి మొదటి ప్రయోగ వేదిక వద్దకు తరలించారు. స్పాడెక్స్ జంట ఉపగ్రహాలను అనుసంధానించి అంతరిక్షయానానికి రాకెట్‌ను సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని రెండు, నాలుగు దశల్లో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ ఆదివారం షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ప్రయోగ నేపథ్యంలో శ్రీహరికోట రాకెట్ కేంద్రం సందడిగా మారింది. మరోవైపు షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్ చుట్టుపక్కలతో పాటు సముద్ర మర్గాన కూడా జల్లెడపట్టి గాలిస్తున్నారు.
- సూళ్లూరుపేట, ఆంధ్రజ్యోతి