Share News

Quick justice సైబర్‌ బాధితులకు ఇక సత్వర న్యాయం

ABN , Publish Date - Oct 03 , 2024 | 01:44 AM

ఇటీవల ఇంటర్నెట్‌ వాడకం పెరుగుతున్నట్టే సైబర్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.చాలామంది వారికి తెలియకుండానే సైబర్‌ నేరస్తులబారిన పడి రూ.లక్షలు కోల్పోతున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌ రుణాలు తీసుకుని మొత్తం చెల్లించినా ఇంకా కట్టాలని సైబర్‌ నేరస్తుల బెదిరింపులకు లోనవుతున్నారు. సైబర్‌ దాడికి గురైనవారు ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

Quick justice సైబర్‌ బాధితులకు ఇక సత్వర న్యాయం

చిత్తూరులోనూ త్వరలో సైబర్‌ పోలీ్‌సస్టేషన్‌

జిల్లాలో పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు

ఐదేళ్లలో 285 కేసుల నమోదు

రూ.5.24 కోట్లను రికవరీ చేసిన పోలీసులు

చిత్తూరు, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ఇంటర్నెట్‌ వాడకం పెరుగుతున్నట్టే సైబర్‌ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.చాలామంది వారికి తెలియకుండానే సైబర్‌ నేరస్తులబారిన పడి రూ.లక్షలు కోల్పోతున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌ రుణాలు తీసుకుని మొత్తం చెల్లించినా ఇంకా కట్టాలని సైబర్‌ నేరస్తుల బెదిరింపులకు లోనవుతున్నారు. సైబర్‌ దాడికి గురైనవారు ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతున్నారు. కొందరు సాధారణ పోలీ్‌సస్టేషన్లలోనే ఫిర్యాదు చేస్తున్నారు. పెద్దగా స్పందన ఉండడం లేదు. పరిష్కారం కావడం లేదు. ఇకనుంచి సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం జిల్లాకో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రమైన చిత్తూరులోనూ ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

2019నుంచి పెరిగిన కేసుల నమోదు

గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న చిత్తూరు జిల్లాలో కూడా సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. 2019 నుంచి సైబర్‌ కేసుల నమోదు శాతం జిల్లాలో బాగా పెరిగింది. 2017లో 5, 2018లో 13 సైబర్‌ కేసులు నమోదైతే.. ఆ తర్వాత నుంచి ప్రతి ఏడాది కేసుల నమోదు సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2019లో 31, 2020లో 59, 2021లో 52, 2022లో 57, 2023లో 58, 2024లో ఇప్పటివరకు 28 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి చూసుకుంటే 285 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదు చేయని బాధితుల సంఖ్య ఇంతకు రెట్టింపుగా ఉంటుందని ఓ అంచనా.సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 జనవరిలో ఎన్‌సీఆర్‌పీ (నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌)ను ప్రారంభించింది. ఇందులో ఆన్‌లైన్‌ అండ్‌ సోషల్‌ మీడియా క్రైమ్స్‌, ఆన్‌లైన్‌ ఫైనాన్సియల్‌ ఫ్రాడ్స్‌, హ్యాకింగ్‌, మొబైల్‌ క్రైమ్స్‌, ఆన్‌లైన్‌ చైల్డ్‌ ఫోర్నోగ్రఫీ, క్రిప్టో కరెన్సీ క్రైమ్‌ వంటి మోసాల మీద ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఎన్‌సీఆర్‌పీ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లా పోలీసులు రూ.5.24 కోట్లను నిందితుల నుంచి రికవరీ చేసి హోల్డ్‌లో పెట్టారు. కోర్టు అనుమతి తర్వాత బాధితులకు ఇవ్వాల్సి ఉంది. అసలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకుండానే ఫిర్యాదు ఆధారంగా రూ.12 లక్షలు వసూలు చేశారు.

ఇదీ సైబర్‌ స్టేషన్‌ బాధ్యత

సైబర్‌ నేరాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. ఫిర్యాదు చేస్తున్నవారి సంఖ్య మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదు. ప్రతి సైబర్‌ నేరానికీ సంబంధించి ఫిర్యాదు ఇచ్చేలా బాధితుల్ని ప్రోత్సహించడం, కేసు దర్యాప్తు చేయడం ఈ పోలీ్‌సస్టేషన్‌ బాధ్యత. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానం బాగున్న సీఐని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా నియమించి ఆయనకు ఆ అంశాల్లో ప్రావీణ్యం ఉన్న సిబ్బందిని కేటాయిస్తారు.

Updated Date - Oct 03 , 2024 | 07:16 AM