Home » Online Scams
ఆన్లైన్ బెట్టింగ్‌కు మరొకరు బలయ్యారు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసైన సోమేశ్వర్రావు మూడు సంవత్సరాల్లో 3 లక్షల వరకు డబ్బులు పోగొట్టాడు. ఈ సందర్భంగా అతను డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది ప్రముఖ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదైన నేపథ్యంలో వారికి మరో 24 గంటల్లో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినో యాప్‌ల ప్రచారానికి సంబంధించి.. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, నిధి, అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల సహా 25 మంది సినీ, టీవీ ప్రముఖులపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాడు. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట.. బుద్ధుందా అసలు.. అంటూ తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.. యూట్యూబర్ హర్షసాయిపై మండిప డ్డారు.
ఆన్లైన్ బెట్టింగుల్లో అప్పులపాలైన ఓ ఐటీ ఉద్యోగి.. ఉద్యోగం మానేసి గంజాయి దందా మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఏపీకి చెందిన శ్రీనివాసులు కొంతకాలం హైదరాబాద్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు చాలా నమ్మకంగా వస్తువులను డెలివరీ చేస్తుండడంతో వినియోగదారులు చాలా వరకు ఆన్లైన్ షాపింగ్నే ఇష్టపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని మోసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్‌కు సంబంధించిన షాకింగ్ కేసు తాజాగా ఒడిశాలో వెలుగులోకి వచ్చింది.
అక్రమ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి స్కీమ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్ ప్రజలకు సూచించారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ ఆయా వెబ్సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలన ఎలా అనుమతిస్తున్నారు ? అంటూ సంబంధిత వెబ్సైట్ల నిర్వాహకులు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిలదీసింది.
ఆన్లైన్ బెట్టింగు(Online betting)లతో అప్పులపాలై.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతి(Tirupati)లో జరిగింది. ఈస్ట్ ఎస్ఐ మహేష్ తెలిపిన మేరకు శ్రీసత్యసాయి జిల్లా కదిరికి చెందిన షేక్‌నూర్ మహ్మద్ ముబారక్ నగరంలోని కరకంబాడిలో ఉంటూ అమర ఆస్పత్రిలో మేల్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాడు.