జిల్లావ్యాప్తంగా వర్షాలు
ABN , Publish Date - Nov 15 , 2024 | 01:56 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా మూడ్రోజులుగా తేలికపాటి నుంచి బలమైన వర్షాలు కురుస్తున్నాయి.
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా మూడ్రోజులుగా తేలికపాటి నుంచి బలమైన వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలిలా ఉన్నాయి. మండలాల వారీగా.. పులిచెర్లలో 19.8, రొంపిచెర్లలో 7.6, యాదమరిలో 6.8, బైరెడ్డిపల్లెలో 5.6, విజయపురంలో 4.2, సోమలలో 4, వెదురుకుప్పంలో 3.6, సదుం, నగరి, గంగాధరనెల్లూరు, వి.కోటలో 3.2, పాలసముద్రంలో 2.4, శ్రీరంగరాజపురంలో 2.2, నిండ్ర, చిత్తూరులో 1.6, చౌడేపల్లె, చిత్తూరు రూరల్‌లో 1.2, తవణంపల్లెలో 0.4, పెనుమూరులో 0.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇదిలా ఉండగా, చిత్తూరు నగరంలో గురువారం ఉదయం నుంచి మబ్బులు కమ్మేసింది. ఆగి ఆగి వర్షం కురుస్తూ, ఉరుములు, పిడుగులతో ప్రజానీకాన్ని ఒకింత ఇబ్బందులకు గురిచేసింది. విద్యుత్ సరఫరాకు పలుసార్లు అంతరాయం ఏర్పడింది.