Revenue meetings - 782గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు
ABN , Publish Date - Dec 05 , 2024 | 01:49 AM
ఈనెల 6వ తేది నుంచి జనవరి 8వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 782 రెవిన్యూ గ్రామాల్లో సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ కోరారు. బుధవారం జేసీ విద్యాధరితో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ సదస్సులపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఈనెల 6వ తేది నుంచి జనవరి 8వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 782 రెవిన్యూ గ్రామాల్లో సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ కోరారు. బుధవారం జేసీ విద్యాధరితో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ సదస్సులపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి ఫ్రీహోల్డ్, సెక్షన్ 22ఏకు సంబంధించిన భూఆక్రమణ సమస్యలపై వినతులు స్వీకరించాలన్నారు.ఆ ఫిర్యాదులన్నింటినీ సంబంధిత పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేయాలన్నారు. రోజూ ఉదయం 9 గంటలకు సదస్సు జరిగే ప్రాంత గ్రామస్థులకు,స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలన్నారు. జేసీ విద్యాధరి ఈ సదస్సులకు సమన్వయకర్తగా పనిచేస్తారన్నారు.తహసీల్దారు, ఆర్‌ఐ, వీఆర్వో, సర్వేయర్, రిజిస్ట్రేషన్‌శాఖ ప్రతినిధి, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు సిబ్బందితో కూడిన అధికార బృందాలు రెవిన్యూ సదస్సుల్లో పాల్గొంటారన్నారు. సదస్సుల ద్వారా అందే ప్రతి అర్జీకి రశీదు ఇవ్వాలని , 45 రోజుల్లోగా పరిష్కరించేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు.
ఫ్రీ హోల్డ్ రిజిస్టర్డ్ భూముల సమాచారాన్ని
వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి
ఫ్రీహోల్డ్ రిజిస్టర్డ్ భూములకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తహసీల్దార్లను జేసీ విద్యాధరి ఆదేశించారు.జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు ఉండగా, వాటిలో 2561 ఎకరాలు రిజిస్టర్ కాబడ్డాయన్నారు. 1344 ఎకరాలు డీవియేషన్ కాగా, 1217 ఎకరాలు చట్టప్రకారం ఉన్నాయన్నారు.