Share News

సదాశివ కోనలో దారి తప్పిన యువకుడు

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:23 AM

వడమాలపేట మండలంలోని సదాశివ కోనకు వెళ్లొస్తుండగా తప్పిపోయిన యువకుడిని సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు రక్షించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగింది.

సదాశివ కోనలో దారి తప్పిన యువకుడు
యువకుడితో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది

రక్షించిన పోలీసులు

వడమాలపేట, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): వడమాలపేట మండలంలోని సదాశివ కోనకు వెళ్లొస్తుండగా తప్పిపోయిన యువకుడిని సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు రక్షించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగింది. చెన్నె నగరం తాంబరానికి చెందిన 20 మంది యువకులు ఆదివారం ఉదయం ఏర్పేడు మండలం చెల్లూరు, పాయల్‌ సెంటర్‌ మీదుగా సదాశివకోనకు నడిచి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా సదాశివకోన ప్రాజెక్టుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో దినేష్‌ దారి తప్పాడు. మిగిలిన వారి ఆచూకీ తెలియక ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. రాత్రి 8.30 గంటల సమయంలో నెం.100కు ఫోన్‌ చేశాడు. పుత్తూరు సీఐ రవీంద్ర స్పందించారు. వడమాలపేట ఎస్‌ఐ ధర్మారెడ్డి, కానిస్టేబుళ్లు సురేష్‌, ఢిల్లీబాబును యువకుడిని వెదకడానికి పంపారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా వారు ఆ యువకుడి ఆచూకీ గుర్తించారు. అటవీశాఖ సిబ్బందితో కలిసి బ్యాటరీ లైట్ల సాయంతో యువకుడిని చేరుకున్నారు. అతడిని వారి బృందానికి అప్పగించారు.

Updated Date - Dec 23 , 2024 | 01:23 AM