కాణిపాకంలో సత్యనారాయణస్వామి వ్రతం
ABN , Publish Date - Mar 26 , 2024 | 12:53 AM
కాణిపాకంలోని వరదరాజస్వామి ఆలయంలో సోమవారం ఉదయం పౌర్ణమి సందర్భంగా మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి పూజ, వ్రతాన్ని నిర్వహింపచేశారు.
ఐరాల(కాణిపాకం), మార్చి 25: కాణిపాకంలోని వరదరాజస్వామి ఆలయంలో సోమవారం ఉదయం పౌర్ణమి సందర్భంగా మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి పూజ, వ్రతాన్ని నిర్వహింపచేశారు. అనంతరం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఉంచి కాణిపాకం పుర వీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి,ఆలయ ఇన్‌స్పెక్టరు రమేష్ తదితరులు పాల్గొన్నారు.