Special Pujas-ప్రత్యేక పూజలు, అభిషేకాలు
ABN , Publish Date - Nov 05 , 2024 | 01:17 AM
జిల్లాలోని శివాలయాలన్నీ ప్రత్యేక పూజలు, అభిషేకాలతో సందడిగా మారాయి.కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా ఆలయాల్లో దీపాలను వెలిగించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు.
జిల్లాలోని శివాలయాలన్నీ ప్రత్యేక పూజలు, అభిషేకాలతో సందడిగా మారాయి.కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా ఆలయాల్లో దీపాలను వెలిగించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరులోని ఇరువారం నాగేంద్రస్వామి, కామాక్షి అంబికా సమేత అగస్తీశ్వరాలయం, నీవానది కాశీ విశ్వేశ్వరాలయం, కట్టమంచి కుళందేశ్వర ఆలయం, పాలసముద్రం మండలం రాచపాళ్యంలోని పంచమూర్తుల ఏకశిలా విగ్రహం, పుంగనూరు మండలం నెక్కొంది కొండపై చోళ రాజులు నిర్మించిన అగస్తీశ్వరాలయం,యాదమరిలోని ఏకాంబరేశ్వర కామాక్షీ దేవిఆలయం, బంగారుపాళ్యం మండలం మొగిలిలోని కామాక్షి సమేత మొగిలీశ్వర ఆలయం,సోమల మండలం పెద్దఉప్పరపల్లె సమీపం దుర్గంకొండలోని గార్గేయ మునీశ్వరస్వామి ఆలయం,రామకుప్పంలోని కాశీవిశ్వేశ్వరాలయం,చౌడేపల్లెలోని మృత్యుంజయేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు విశేష పూజలు నిర్వహించారు.
-చిత్తూరు , ఆంధ్రజ్యోతి