వరదయ్యపాళెం ఏఎ్‌సఐ సస్పెన్షన్
ABN , Publish Date - Aug 23 , 2024 | 01:49 AM
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎ్‌సఐ షణ్ముగాన్ని ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం సస్పెండ్ చేశారు.
వరదయ్యపాళెం, ఆగస్టు 22: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎ్‌సఐ షణ్ముగాన్ని ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం సస్పెండ్ చేశారు. వరదయ్యపాళెంలో గత ఆదివారం రాత్రి 10.45గంటలకు ఇందిరానగర్‌కు చెందిన ఇద్దరు యువకులు గొడవ పడ్డారు.వారిలో ఒకరు రాత్రి 11గంటల సమయంలో పోలీ్‌సస్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి రాగా సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఈ విషయాన్ని స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్న ఏఎ్‌సఐ షణ్ముగానికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. మరుసటి రోజు వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పాడు.సోమవారం సాయంత్రం కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు విషయంలో షణ్ముగం నిర్లక్ష్యం చూపాడంటూ ఎస్పీ సుబ్బరాయుడికి బాధితులు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు స్వీకరించి విచారణ జరపకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాడం, పై అధికారులకు తెలియజేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమనే కారణాలతో ఏఎ్‌సఐ షణ్ముగాన్ని ఎస్పీ సుబ్బరాయుడు సస్పెండ్ చేశారు. విఽధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరిపైన అయినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.