ఆలయాలు కిటకిట
ABN , Publish Date - Jan 02 , 2024 | 12:47 AM
నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా సోమవారం కాణిపాకం భక్తులతో కిటకిటలాడింది.
నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా సోమవారం కాణిపాకం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు రద్దీ తగ్గకుండా వరసిద్ధుడి దర్శనార్థం విచ్చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి మాడ వీధుల్లోకి వచ్చేశారు. దీంతో స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. భక్తులకు అన్నం ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లను అందించారు.
- ఐరాల(కాణిపాకం)