కార్మికులకు భరోసా కల్పించడానికే బస్సుయాత్ర
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:18 AM
రాష్ట్రంలో కార్మికులకు భరోసా కల్పించడానికే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కుప్పం వరకు చంద్రన్న కార్మిక చైతన్య బస్సుయాత్రను చేపట్టినట్లు నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు.
నగరి, జనవరి 27: రాష్ట్రంలో కార్మికులకు భరోసా కల్పించడానికే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కుప్పం వరకు చంద్రన్న కార్మిక చైతన్య బస్సుయాత్రను చేపట్టినట్లు నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నగరి పట్టణానికి బస్సుయాత్ర చేరుకోవడంతో భానుప్రకాష్ వారికి స్వాగతం పలికారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి టీఎన్‌టీయూసీ నాయకులకు తినిపించి బస్సుయాత్రను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో కార్మికులకు భద్రత, ఉపాధి లేకుండా పోయిందని విమర్శించారు. రానున్న రోజులలో కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి భరోసా కల్పిస్తూ ఈ బస్సుయాత్ర సాగుతోందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. చిత్తూరు జిల్లా టీఎన్‌టీయూసీ అధ్యక్షులు రావిళ్ల మాధవ నాయుడు, రాష్ట్ర టీఎన్‌టీయూసీ అధ్యక్షులు రఘురామరాజు, రాష్ట్ర కార్యదర్శి బాలాజీ, జిల్లా అధికారప్రతినిధి జ్యోతి నాయుడు, గుణశేఖర్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, రమే్‌షబాబు, మాణిక్యవాసన్, ఆనందరెడ్డి, జిందూజా, లెనిన్‌బాబు, పరుచూరి ప్రసాద్, శివాజీ, పలువురు కార్మికులు పాల్గొన్నారు.