Share News

కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారి తిట్ల దండకం

ABN , Publish Date - Dec 22 , 2024 | 02:07 AM

తన బదిలీ కోసం రాజకీయ సిఫార్సు చేసిన ఓ కానిస్టేబుల్‌పై పోలీసు ఉన్నతాధికారి తీవ్రస్థాయిలో ఆగ్రహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారి తిట్ల దండకం

బదిలీ కోసం రాజకీయ సిఫార్సు చేయించిన ఫలితం

చిత్తూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తన బదిలీ కోసం రాజకీయ సిఫార్సు చేసిన ఓ కానిస్టేబుల్‌పై పోలీసు ఉన్నతాధికారి తీవ్రస్థాయిలో ఆగ్రహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇటీవల రామకుప్పం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆ ఉన్నతాధికారి అదే స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో బదిలీ కోసం సిఫార్సు చేసుకున్న విషయాన్ని అతడికి గుర్తుచేశారు.రాజకీయ సిఫార్సులు చేయిస్తావా అంటూ ఆగ్రహించారు. యూనిఫాం తీసేసి బయటికి వెళ్ళిపో అంటూ ఊగిపోయారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కానిస్టేబుల్‌ అదే రోజు కుప్పంలోని రైలు పట్టాల మీద పడుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.ఆ విషయం తెలిసి కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కాపాడుకున్నారు. పక్కనే ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 02:07 AM