ప్రభాకరుడి ప్రతాపం
ABN , Publish Date - Apr 27 , 2024 | 01:25 AM
చిత్తూరు జిల్లాలో రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రతకు జనం బయటకు రావడానికి భయపడిపోతున్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా మధ్యాహ్న సమయంలో వీధులన్నీ బోసిపోతున్నాయి
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 26: జిల్లాలో రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రతకు జనం బయటకు రావడానికి భయపడిపోతున్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా మధ్యాహ్న సమయంలో వీధులన్నీ బోసిపోతున్నాయి. శుక్రవారం పులిచెర్లలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే శ్రీరంగరాజపురంలో 42.3, సోమల 42.2, తవణంపల్లె 42.1, పుంగనూరు 41.8, నిండ్ర 41.3, బంగారుపాళ్యం 41.1, గుడిపాల 40.8, సదుం 40.8, కుప్పం 40.7, పాలసముద్రం 40.1, చిత్తూరులో, గంగాధరనెల్లూరు, కార్వేటినగరంలో 40 డిగ్రీలు నమోదైంది.