Share News

ఏజెన్సీలకు మూడు ఇసుక యార్డులు

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:17 AM

జిల్లాలో మూడు ఇసుక యార్డులను లాటరీ పద్ధతి ద్వారా మూడు ఏజెన్సీలకు అప్పగించినట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

ఏజెన్సీలకు మూడు ఇసుక యార్డులు
ఇసుక యార్డులకు లాటరీ తీస్తున్న కలెక్టర్‌

లాటరీ పద్ధతి ద్వారా అప్పగింత

తిరుపతి, కలెక్టరేట్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు ఇసుక యార్డులను లాటరీ పద్ధతి ద్వారా మూడు ఏజెన్సీలకు అప్పగించినట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లో జేసీ శుభంబన్సల్‌తో కలిసి ఆయన ఇసుక స్టాక్‌యార్డుకు సంబంధించిన లాటరీ నిర్వహించారు. అవిలాలకి సంబంధించిన లీలాఎంటర్‌ప్రైజ్‌సకి, కాటన్‌మిల్‌కు సంబంధించి పి.శ్రీనివాసులురెడ్డి, గాజులమండ్యం స్టాకు యార్డుకు సంబంధించి తిష్య కన్ష్ట్రక్షన్స్‌కే శ్రీనివాసులకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐదు రోజుల్లోగా ఇసుకను అందుబాటులో తేవాలని, ప్రజలందరికీ ఇసుక స్టాక్‌ యార్డుల గురించి అవగాహన కల్పించాలన్నారు. కాగా, అన్నమయ్య జిల్లా టుంగుటూరు గ్రామం నందలూరు నుంచి ఇసుకను తెప్పించుకుని కాటన్‌ మిల్లు వద్ద ఉంచుతారు. ఇక్కడ టన్ను రూ.640 అందుబాటులో ఉంచుతున్నారు. రేణిగుంట మండలం గాజులమండ్యం దగ్గర టన్ను రూ.675, తిరుపతి రూరల్‌ మండలం అవిలాల వద్ద ఇసుక టన్ను రూ.645గా నిర్ధారించారు. నిర్ణయించిన ధరలకంటే ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా డీలర్‌షిప్‌ రద్దు చేస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Nov 21 , 2024 | 01:17 AM