Share News

సొనకాలువలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ABN , Publish Date - Nov 17 , 2024 | 02:02 AM

చిల్లకూరు మండలం ఏరూరు అల్లీపురం ఎస్టీకాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు సొన కాలువలో పడి మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

సొనకాలువలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ఏరూరు అల్లీపురంలో విషాదం

చిల్లకూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): చిల్లకూరు మండలం ఏరూరు అల్లీపురం ఎస్టీకాలనీకి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు సొన కాలువలో పడి మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్టీకాలనీకి చెందిన నాగేంద్ర, చెంచమ్మ దంపతుల కుమార్తె నాగేంద్రమ్మ(11), ఏడుకొండలు, రాములమ్మ దంపతుల కుమారుడు చింతాలయ్య(10) పాఠశాలకు వెళ్లడంలేదు. శనివారం మధ్యాహ్నం నాగేంద్రమకమ తల్లి సొనకాలువ వద్ద బట్టలు ఉతికేందుకు వెళుతుండగా ఆమెతో పాటు నాగేంద్రమ్మ, చింతాలయ్య కూడా వెళ్లారు. అక్కడున్న కొందరు పిల్లలతో కలిసి సరదాగా వీరు సొన కాలువలోకి దిగారు. నాగేంద్రమ్మ, చింతాలయ్యకు ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. గమనించిన స్నేహితులు కేకలు వేయడంతో స్థానికులు కాలువలోకి దిగి చిన్నారులను వెలుపలకు తీసుకొచ్చారు. అప్పటికే వీరిద్దరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురే్‌షబాబు చెప్పారు. ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్‌ తానంకి నానాజి కలిసి మృతుల ఒక్కో కుటుంబానికి రూ.పది వేల చొప్పున పార్టీ నేతల ద్వారా అందజేశారు.

Updated Date - Nov 17 , 2024 | 02:02 AM