అమ్మో.. ఏనుగుల గుంపు
ABN , Publish Date - Oct 26 , 2024 | 02:03 AM
రోడ్డుకు ఒక వైపు 16 ఏనుగుల ఘీంకారాలు. మరో వైపు వీటిని చూసేందుకు గుమిగూడిన జనం.
రోడ్డుకు ఒక వైపు 16 ఏనుగుల ఘీంకారాలు. మరో వైపు వీటిని చూసేందుకు గుమిగూడిన జనం. ఇంకోవైపు రోడ్డుకు రెండువైపులా బందోబస్తు చేపడుతూ ఏనుగులను అడవి వైపు మళ్లించేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలోని గుట్టమీదపల్లి వద్ద శుక్రవారం ఉదయం దృశ్యమిది. రెండు గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. చివరకు ఏనుగుల గుంపు అడవి వైపు అడుగులు వేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
- కల్లూరు