Share News

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సినేషన్‌ బంద్‌

ABN , Publish Date - May 30 , 2024 | 01:03 AM

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో వేసే అన్ని రకాల వ్యాక్సిన్లను బంద్‌ చేశారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌కు వచ్చే చంటి పిల్లల తల్లులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సినేషన్‌ బంద్‌
ఆస్పత్రిలో మూసి ఉన్న వ్యాక్సినేషన్‌ గది

ఫ చంటిపిల్లల తల్లులకు తప్పని అవస్థలు

చిత్తూరు రూరల్‌, మే 29: చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో వేసే అన్ని రకాల వ్యాక్సిన్లను బంద్‌ చేశారు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌కు వచ్చే చంటి పిల్లల తల్లులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలతోపాటు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్లు వేస్తున్నారు. అయితే రెండు వారాలుగా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అన్ని రకాల వ్యాక్సిన్లను వైద్యాధికారి డాక్టర్‌ కళ్యాణ్‌ నిలిపివేశారు. దీనిపై తల్లులు అడిగితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాలతోనే వేయడం లేదని సమాధానం చెబుతున్నారు. జిల్లా టీకాల అధికారి(డీఐవో)కి ఫిర్యాదు చేయగా తాము అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని, వెంటనే వ్యాక్సిన్లు వేయాలని ఆదేశించారు. అయినా ఆయన స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 30 , 2024 | 01:03 AM