Share News

స్వర్ణ రథంపై వరసిద్ధుడి విహారం

ABN , Publish Date - Dec 19 , 2024 | 01:49 AM

కాణిపాక ఆలయంలో బుధవారం సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించారు. ఉదయం మూల విరాట్‌కు వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఆస్థాన మండపంలోని వేదికపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు.

 స్వర్ణ రథంపై వరసిద్ధుడి విహారం
స్వర్ణ రథాన్ని లాగుతున్న ఎమ్మెల్యే, ఈవో తదితరులు

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాణిపాక ఆలయంలో బుధవారం సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించారు. ఉదయం మూల విరాట్‌కు వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఆస్థాన మండపంలోని వేదికపై సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల ఆధ్వర్యంలో సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించారు.రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను స్వర్ణరథంపై ఉంచి మాఢవీధుల్లో ఊరేగించారు. స్వర్ణరథంపై స్వామిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు కాణిపాకం తరలివచ్చారు. ఎమ్మెల్యే మురళీమోహన్‌,ఆలయ ఈవో పెంచల కిషోర్‌, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఇన్‌స్పెక్టర్లు బాలాజీ నాయుడు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 01:49 AM