అలిపిరి వద్ద వాహనాల రద్దీ
ABN , Publish Date - Dec 29 , 2024 | 02:17 AM
వారాంతపు సెలవులు కావడంతో శనివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి చెక్‌పాయింట్ వద్ద వాహనాలు బారులుతీరాయి.
తిరుపతి(వైద్యం), డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వారాంతపు సెలవులు కావడంతో శనివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి చెక్‌పాయింట్ వద్ద వాహనాలు బారులుతీరాయి. తిరుమలకు వెళ్లే భక్తులు గంటల తరబడి వాహనాల్లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వాహనాలను వేగంగా తనిఖీ చేసినా తిప్పలు తప్పలేదు.