అప్పుడేం జరిగింది?
ABN , Publish Date - Nov 15 , 2024 | 02:15 AM
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వ అధికారులపై విచారణ వేగవంతమైంది. మంత్రి లోకే్‌షకు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలతో గురువారం కార్పొరేషన్ కార్యాలయానికి విచారణ బృందం వచ్చింది.
తిరుపతి కార్పొరేషన్లో గత అధికారులపై విచారణ
ఆర్డీ నేతృత్వంలో లోతుగా ఆరా తీస్తున్న బృందాలు
తిరుపతి నవంబర్ 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వ అధికారులపై విచారణ వేగవంతమైంది. మంత్రి లోకే్‌షకు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలతో గురువారం కార్పొరేషన్ కార్యాలయానికి విచారణ బృందం వచ్చింది. అనంతపురం రీజనల్ డైరెక్టర్ విశ్వనాథ్ నేతృత్వంలో ప్రొద్దుటూరు, కళ్యాణదుర్గం,పుత్తూరు మున్సిపల్ కమిషనర్లతో పాటు ఓ రెవెన్యూ అధికారి, ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్టెక్టర్ల బృందం విచారణ మొదలుపెట్టింది. గతంలో ఇక్కడ రెవెన్యూ అధికారిగా పనిచేసిన కేఎల్‌వర్మకు సంబంధించిన వ్యవహారాలపై ఆరా తీశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఇంటి పన్నులు పెంచిన, తగ్గించిన అభియోగాలపై రికార్డులను పరిశీలించారు. ఆయన దగ్గర పనిచేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు మధుసూదన రెడ్డి,భాస్కర రెడ్డి,సూరిబాబు,ప్రకాష్, నవీన్‌లను విచారించారు. శుక్రవారం క్షేత్రస్థాయిలోనూ పరిశీలించి ఇంటి పన్నుల వ్యత్యాసాలపై తనిఖీ చేయనున్నారు.మున్సిపల్ గత మేనేజర్ చిట్టిబాబుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్లకు సంబంధించి ఆర్గనైజర్‌కు అడ్డగోలుగా బిల్లులు చెల్లించారనే ఆరోపణపై ఆరా తీశారు.కార్పొరేషన్ అకౌంటెం ట్‌ను పిలిచి ఓచర్లను పరిశీలించారు. వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది.