బాలాజీ డివిజన్ కల ఫలించేనా?
ABN , Publish Date - Nov 03 , 2024 | 02:16 AM
భారత రైల్వేలో గ్రేడ్-1 రైల్వేస్టేషన్లలో తిరుపతి ఒకటి. అయితే ఇక్కడ బాలాజీ డివిజన్ ఏర్పాటు కలగానే మిగిలింది.
- రద్దీకి అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయాలి
- పుణ్యక్షేత్రాల మధ్య ప్యాసింజర్ రైళ్లు నడపాలి
- రైల్వే ప్రాజెక్టులపై రేపు పార్లమెంటరీ కమిటీ సమావేశం
తిరుపతి(సెంట్రల్) నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): భారత రైల్వేలో గ్రేడ్-1 రైల్వేస్టేషన్లలో తిరుపతి ఒకటి. అయితే ఇక్కడ బాలాజీ డివిజన్ ఏర్పాటు కలగానే మిగిలింది. తిరుపతి పుణ్యక్షేత్రానికి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సమీప ప్రాంతాల్లో రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయాల్సి ఉంది. అదే సమయంలో స్టేషన్లు అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రయత్నాలు తక్కువగానే జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాల మధ్య మెము ప్యాసింజర్ రైళ్లు నడపాలనే డిమాండ్ అమలుకు నోచుకోవడం లేదు. సోమవారం తిరుపతిలో రైల్వే ప్రాజెక్టులపై జరగనున్న పార్లమెంటరీ కమిటీ సమావేశంలో వీటిపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చేపట్టాల్సిన పనులివీ..
తిరుపతి-రేణిగుంట మధ్య మూడవ రైలు మార్గం ఏర్పాటు చేయాలి.
రేణిగుంట జంక్షన్‌ను మరో టెర్మినల్ చేయాలి.
బాలాజీ డివిజన్ ఏర్పాటు చేయాలి.
చంద్రగిరి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలి.
సీఆర్ఎస్ సామర్థ్యం పెంచాలి.
తిరుపతి వెస్ట్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాలి. ప్యాసింజర్ రైళ్లను అక్కడి నుంచే నడిపే విధంగా పనులు చేపట్టాలి.
పాకాల జంక్షన్‌కు తగిన ప్రాధాన్యత కల్పించి, అభివృద్ధి పనులు చేపట్టాలి.