chairman's car-చైర్మన్ కారుకే అడ్డొస్తావా?
ABN , Publish Date - Oct 24 , 2024 | 01:47 AM
‘ఆస్పత్రిలో చైర్మన్ కారుకే అడ్డు వస్తావా? అసలు ఆస్పత్రిలోకి ఆటోను ఎవరు అనుమతించారు?’ అంటూ రోగిని తీసుకువచ్చిన ఆటో డ్రైవరుపై రుయా హెచ్‌డీఎ్‌స సభ్యుడు బండ్ల లక్ష్మీపతి బుధవారం విరుచుకుపడ్డారు.
ఫ ఆటో తాళాలు లాక్కొని అవుట్‌పోస్టులో ఇచ్చిన రుయా హెచ్‌డీఎ్‌స సభ్యుడు
ఫ ఆక్సిజన్ మాస్కుతో రోగికి తప్పని నిరీక్షణ
‘ఆస్పత్రిలో చైర్మన్ కారుకే అడ్డు వస్తావా? అసలు ఆస్పత్రిలోకి ఆటోను ఎవరు అనుమతించారు?’ అంటూ రోగిని తీసుకువచ్చిన ఆటో డ్రైవరుపై రుయా హెచ్‌డీఎ్‌స సభ్యుడు బండ్ల లక్ష్మీపతి బుధవారం విరుచుకుపడ్డారు. ఆయన తీరుతో ఆక్సిజన్‌పై ఉన్న రోగి గంటకుపైగా ఆటోలోనే నిరీక్షించాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. తీవ్ర ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆక్సిజన్‌పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని వైద్యుల సూచనల మేరకు పరిపాలనా భవనంలో ఉన్న ఆల్ర్టాసౌండ్ స్కానింగ్ కోసం ఆటోలో తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడకు హెచ్‌డీఎ్‌స సభ్యుడు లక్ష్మీపతి కారు వచ్చింది. ఆయన కారుకు ఆ ఆటో అడ్డురావడంతో వెంటనే ఆయన కిందకు దిగారు. నీ ఆటోను ఇక్కడ వరకు అనుమతించింది ఎవరంటూ ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. నడవలేని పరిస్థితిలో ఆక్సిజన్‌పై రోగిని స్కానింగ్ కోసం తీసుకువచ్చానని డ్రైవరు చెబుతున్నా వినిపించుకోలేదు. బలవంతంగా ఆటో తాళాలు తీసుకొని పక్కనే ఉన్న అవుట్ పోస్టులోని పోలీసులకు అప్పగించారు. మరోసారి ఇలా అడ్డం వస్తే నువ్వు నీ ఆటో బయటకు పోరని గట్టిగా మందలించి వెళ్లిపోయారు. అనంతరం ఆటో డ్రైవరు జరిగిన విషయం అవుట్ పోస్టులోని పోలీసులకు చెప్పి బతిమలాడుకోవడంతో చివరకు ఆటో తాళాలు ఇచ్చారు. అప్పటి వరకు దాదాపు గంటకుపైగా ఆటోలో ఆక్సిజన్ మాస్కుతో రోగి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఆక్సిజన్ అయిపోయివుంటే పరిస్థితి ఏంటని రోగి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.