టీడీపీలోకి వైసీపీ ఎంపీటీసీలు
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:46 AM
రామకుప్పం మండలానికి చెందిన పలువురు వైసీపీ ఎంపీటీసీలు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
రామకుప్పం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రామకుప్పం మండలానికి చెందిన పలువురు వైసీపీ ఎంపీటీసీలు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్‌చైర్మన్ మునిరత్నం ఆధ్వర్యంలో వారు అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. విజలాపురం ఎంపీటీసీ వెంకట్రామగౌడు, ముద్దనపల్లె ఎంపీటీసీ మంజునాథ్, రామకుప్పం-1ఎంపీటీసీ ఫిర్దోస్ భర్త తజ్ముల్‌బాషా, గొరివిమాకులపల్లె ఎంపీటీసీ సుబ్బమ్మ కుమారుడు అశోక్, పంద్యాలమడుగు ఎంపీటీసీ జయమ్మ కుమారుడు నాగభూషణంనాయక్, ఉన్సిగానిపల్లె ఎంపీటీసీ సులోచన భర్త గుర్రప్ప, సింగసముద్రం ఎంపీటీసీ అశ్విని భర్త ఆనంద్‌లను చంద్రబాబు టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని నమ్మి తాము టీడీపీలో చేరామని వారు ఈ సందర్భంగా తెలిపారు.టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునస్వామి, బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పట్రనారాయణాచారి, టీడీపీ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆనందరెడ్డి, నరసింహులు, మాజీ ఎంపీపీ ఆంజనేయరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చిన్నికృష్ణ, రామ్మూర్తి, చలపతి, సలాంసాబ్, నందారెడ్డి, మహ్మద్ రఫీ, రామలింగారెడ్డి, మనోహర్, విశ్వనాథ్, జయశంకర్, కృష్ణానాయక్,నాగభూషణం, జేయి, మునిరాజనాయక్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ఖాతాలోకి త్వరలో
రామకుప్పం ఎంపీపీ పదవి
రామకుప్పం మండల పరిషత్ అధ్యక్ష పదవి టీడీపీ ఖాతాలోకి వెళ్ళడం ఖాయమైనట్టే. ప్రత్యేక పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయంతో రామకుప్పం మండలంలో కూడా టీడీపీ అభ్యర్థులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో మండలంలోని 17ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. మణీంద్రం ఎంపీటీసీగా ఎన్నికైన వైసీపీ మండల కో-కన్వీనర్ చంద్రారెడ్డి భార్య శాంతకుమారి ఎంపీపీగా ఎన్నికయ్యారు. రెండేళ్ళ క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందగా వైస్ ఎంపీపీ సుబ్రహ్మణ్యం ఎంపీపీ అయ్యారు.టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు రామకుప్పం ఎంపీపీ స్థానంపై దృష్టి సారించారు.ప్రస్తుతమున్న 16మంది ఎంపీటీసీల్లో ఏడుగురు మంగళవారం టీడీపీలో చేరినట్టయింది. ఎంపీపీ పదవిని చేజిక్కించుకోవాలంటే టీడీపీకి 9మంది ఎంపీటీసీల మద్దతు అవసరం.మణీంద్రం ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎన్నికైతే టీడీపీ బలం 8కి పెరుగుతుంది. అప్పుడు టీడీపీకి మరో ఎంపీటీసీ మద్దతు అవసరమవుతుంది. ప్రసుత్తం వైసీపీలో ఉన్న 8మంది ఎంపీటీసీల్లో ఇద్దరు ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి సహకరిస్తామని హమీ ఇచ్చినట్టు సమాచారం.ఇక టీడీపీలో ఎంపీపీ పదవిపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలిసింది.గతంలో ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ సీనియర్ నేత రామ్మూర్తి భార్య సులోచనమ్మకే ఆ పదవి కట్టబెట్టాలని నియోజకవర్గ సమన్వయ కమిటీ తీర్మానించినట్టు పార్టీ నేతలు తెలిపారు. ఇదే విషయమై తాను సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించినట్టు రామ్మూర్తి తెలిపారు.మణీంద్రం ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.