Share News

Cleanliness : పరిసరాల శుభ్రతే ప్రధానం

ABN , Publish Date - Sep 19 , 2024 | 11:23 PM

పరిసరాల శుభ్రతే ప్రధానమని ఈఓపీఆర్డీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బొమ్మవరం జడ్పీ హైస్కూల్లో నిర్వహిం చిన స్వచ్ఛ తా హి సేవలో పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులు మండల అధికారులు, ఉపాధ్యా యులు లక్ష్యాలు, ఉద్ధేశ్యాలపై ఈఓపీఆర్డీ ప్రధా నోపాధ్యాయులు వివరించారు.

Cleanliness : పరిసరాల శుభ్రతే ప్రధానం
రామాపురంలో ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హి సేవ చేయాలి

ప్రతిజ్ఞ చేసిన అధికారులు, విద్యార్థులు

ఓబులవారిపల్లె, సెప్టెంబరు 19: పరిసరాల శుభ్రతే ప్రధానమని ఈఓపీఆర్డీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బొమ్మవరం జడ్పీ హైస్కూల్లో నిర్వహిం చిన స్వచ్ఛ తా హి సేవలో పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులు మండల అధికారులు, ఉపాధ్యా యులు లక్ష్యాలు, ఉద్ధేశ్యాలపై ఈఓపీఆర్డీ ప్రధా నోపాధ్యాయులు వివరించారు. విద్యార్థులతో ప్రతి జ్ఞ చేయించిన అనంతరం గ్రామంలో పరిసరాలు పరిశుభ్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహిం చారు. పంచాయతీ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, స్థానిక టీడీపీ నేతలు చెంగల్‌రాజు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేసిన అధికారులు

రామాపురం, సెప్టెంబరు19: స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద గురువారం మండల అధికారి టీం స్వచ్ఛ మండ లం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఎంపీడీఓ సూర్యనారా యణరెడ్డి, తహసీల్దార్‌ రామాంజులు మాట్లాడు తూ జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్రంతో పాటు అభివృద్ధి స్వచ్ఛమైన దేశం కోసం అకాం క్షించారు. ఆయన ఆశయ సాధనలో మనవంతు గా ఇంటి, పరిసరాలు, వీధిని, మన గ్రామాన్ని, మన మండలాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతిన బూనుదామన్నారు. వారానికి రెం డు గంటలు, ఏడాదికి వంద రోజులు స్వచ్ఛందం గా పరిశుభ్రత కోసం కేటాయిద్దామని ప్రతి ఒక్క రూ ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. ఈఓపీ ఆర్‌డీ ఉషారాణి, ఎంఈఓ రామకృష్ణుడు, ఏపీఓ పెంచలయ్య, వెలుగు ఏపీఎం దేవయాని, ఆర్‌ఐ రవికుమార్‌, వీఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.


19LRP2.gifలక్కిరెడ్డిపల్లెలో విద్యార్థులు, రెవెన్యూ సిబ్బంది మానవహారం

ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

లక్కిరెడ్డిపల్లె సెప్టంబరు19: ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హి సేవలో పాల్గొనాలని ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, తహసీలారు లక్ష్మిప్రసన్న పేర్కొ న్నారు. గురువారం స్థానిక వెంకటేశ్వర జూని యర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యం లో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మానవహారంగా నిలిచారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌ రెడ్డి, ఈఓపీఆర్‌డీ పట్నాయక్‌, అధ్యాపకులు క్రిష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌ రెడ్డి, డీటీ రాఘవేంద్రరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

రహదారి పరిశుభ్రత

చిన్నమండెం, సెప్టెంబరు19: స్వచ్చతా హి సేవ లో భాగంగా దేవగుడిపల్లి పంచాయతీలోని దేవగుడి కస్పా నుంచి కుర్వపల్లి వెళ్లే దారిని సెక్రటరీ సుమిత్రమ్మ పరిశుభ్రంగా చేయించారు. ఎంపీడీఓ దివ్య అధ్యక్షతన మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కార్యాలయ సిబ్బందితో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - Sep 19 , 2024 | 11:23 PM