Share News

ప్రజెంటేషన్‌ బాగుంది.. ఔట్‌కమ్‌ లేదు!

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:36 AM

రైతుల ఆదాయం పెరగాలని, ఖర్చులు తగ్గాలని సీఎం చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణను అభివృద్ధి చేయాలని చెప్పారు.

ప్రజెంటేషన్‌ బాగుంది.. ఔట్‌కమ్‌ లేదు!

అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తి

వ్యవసాయ పాలసీ తీసుకువస్తాం: సీఎం

అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): రైతుల ఆదాయం పెరగాలని, ఖర్చులు తగ్గాలని సీఎం చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణను అభివృద్ధి చేయాలని చెప్పారు. త్వరలోనే నూ తన వ్యవసాయ విధానాన్ని తీసుకువస్తామని చెప్పారు. బుధవారం కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సీఎం మాట్లాడుతూ.. ‘ఈ ప్రజెంటేషన్‌లో ప్రోగ్రాం ప్రాసెస్‌ గురిం చి ఎక్కువ చెప్పారు. ఔట్‌కమ్‌ మిస్సయ్యారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత, వినియోగదారులకు సరసనమై న ధరలకు అందించడం ముఖ్యం. వాటి గురించి ఒక్కమాట కూడా లేదు. వచ్చే రబీకి ఏం ప్లాన్‌ చే శారు? ప్రకృతి వ్యవసాయంలో ఇంటిగ్రేషన్‌ ఎంతవరకు చేశారు?’ అని సీఎం ప్రశ్నించారు. టెక్నాలజీ వినియోగంలో వ్యవసాయ శాఖ సామర్థ్యం పెరగాలన్నారు. ఉద్యాన శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయం, ఉద్యాన శాఖ, ఆక్వాకల్చర్‌లో వృద్ధి రేటులో చాలా వ్యత్యాసాలు ఉన్నాయ ని, ఇది సరికాదన్నారు. హార్టికల్చర్‌, చేపలు, రొయ్య ల సాగు బాగా దెబ్బతిన్నదని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంటల సాగులో తెగుళ్ల నివార ణ, జీరోవేస్ట్‌ లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయిల్‌ పామ్‌ దిగుబడులు బాగా తగ్గిపోతున్నాయని, విఫల ప్రయోగాలు చేయొద్దని అధికారులకు సూచించారు. వాణిజ్య పంటల ఉత్పత్తులతో ఎగ్జిబిషన్లు నిర్వహించాలని ఆదేశించారు.

Updated Date - Dec 12 , 2024 | 03:36 AM