Share News

AP Assembly Session 2024: అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు .. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:23 PM

అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు బయటపెట్టింది కూటమి ప్రభుత్వం. ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు.

 AP Assembly Session 2024: అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు .. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల
AP Assembly Session

అమరావతి: అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు బయటపెట్టింది కూటమి ప్రభుత్వం. ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ఏపీకి సమస్యలు ఏర్పడ్డాయని, శాస్త్రీయ విధానం లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హైదరాబాద్‌ను కోల్పోవడం ఏపీకి ఆర్థికంగా ఇబ్బంది. విభజన సమయంలో ఏపీకి వచ్చిన ఆదాయం 46 శాతం. ఆస్తులు హైదరాబాద్‌లో ఉండిపోయాయి. గతంలో పెన్షన్లు రావనే పరిస్థితులు వచ్చాయి. ఏపీలో పట్టణ ప్రాంతాలు తక్కువ. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండటంతో ఆదాయం తక్కువగా ఉంది’’ అని చంద్రబాబు ప్రస్తావించారు.


‘‘సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏపీకి 46 శాతం ఆదాయం. 52 శాతం జనాభా ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం. 42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 54 శాతం ఆదాయం. కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నాయి. పునర్విభజన చట్టంలో షెడ్యూల్‌ 9, 10 సమస్యలు పరిష్కారం కాలేదు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి. సేవల రంగం తెలంగాణకు వెళ్తే.. ఏపీకి వ్యవసాయ వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయంలో ఆదాయం తక్కువ’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


నాటి పాలకుడే ఈ స్థితి తీసుకొచ్చాడు...

2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సభ ముందు ఉంచారు. ఐదేళ్లపాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని తెలిపారు.‘‘ గోదావరి ఉన్నంత వరకూ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు. కానీ ఆ పరిస్ధితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు. పోలవరానికి 15,364 కోట్లు ఖర్చు చేశాం. అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈపాటికే ప్రాజెక్టు ప్రారంభమయ్యేది. కేంద్రం వేసిన ఎక్సఫర్ట్ కమీటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సమాంతరంగా కొత్త డయాఫ్రాం వాల్ నిర్మించాలని అత్యవసర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నాం. దీంతో రూ.990 కోట్లు దీనికోసం ఖర్చే చేయాల్సి వస్తోంది’’ అని చంద్రబాబు అన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 01:12 PM