Share News

Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. అసలు లెక్కలు ఇవే

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:48 PM

ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. అసలు లెక్కలు ఇవే
Chandrababu

అమరావతి: ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.


పోలవరం ఆంధ్రప్రదేశ్‌‌కు జీవనాడి అని, అలాంటి ప్రాజక్టును 5 ఏళ్లపాటు (2019-24) ఎలా విధ్వంసం చేసారో ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పడు పోలవరం పనులు ఒక యజ్ఞంలా సాగాయని, అప్పట్లో ఉన్న సమస్యలను, సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని చంద్రబాబు గుర్తుచేశారు. ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి నాటి ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని చంద్రబాబు గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్ వర్కుల పనులు చేస్తూనే ఎగువ, దిగువ కాఫర్ కాఫర్ డ్యాంల నిర్మాణం పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని చంద్రబాబు ప్రస్తావించారు.


72 శాతం పనులకు రూ.11,537 కోట్లు ఖర్చు

రెండు కిలోమీటర్ల పొడవుతో, 100 మీటర్ల పైగా లోతుతో డయాఫ్రం వాల్ నిర్మాణం చేపెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. జర్మన్ కంపెనీ ‘బావర్’ ద్వారా ఈ పనులు పూర్తి చేయించామని పేర్కొన్నారు. స్పిల్ వే గేట్ల డిజైన్లు సిద్దం చేసి.. గేట్ల అమరిక సైతం అప్పట్లోనే ప్రారంభించామని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి పనికి పీపీఏ, కేంద్ర జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకున్నామని, అప్పట్లో జల వనరుల శాఖా మంత్రులుగా ఉన్న ఉమాభారతి, నితిన్ గడ్కరీలు పోలవరం వచ్చి పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ప్రస్తావించారు.

టీడీపీ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయ్యాయని, 5 ఏళ్ల కాలంలో 28 సార్లు క్షేత్ర స్థాయి పర్యటనకు, 82 సార్లు వర్చ్యువల్‌గా చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ 5 ఏళ్ల కాలంలో మొత్తం 72 శాతం పనులు జరగగా.. అందుకు రూ.11,537 కోట్లు ఖర్చయ్యాయి.


జగన్ హయాంలో తప్పుడు నిర్ణయాలు - రివర్స్ టెండర్లు..

గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు నిర్ణయాలు - రివర్స్ టెండర్ల డ్రామాలు ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. నాడు 2019లో వైసీపీ ప్రభుత్వంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రమే పోలవరం పనులు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. సైట్‌లో నిర్మాణ సంస్థ ఖాళీ చేయాల్సిందిగా జులై 29, 2019న నోటీసులు జారీ చేశారని, 2019 జులై 24న ఇచ్చిన పీటర్ కమిటీ రిపోర్టు ఆధారంగా రివర్స్ టెండర్ల డ్రామా ఆడారని చంద్రబాబు విమర్శించారు.

పోలవరంలో అవినీతే జరగలేదని కేంద్రం తేల్చిందని, డిసెంబర్ 02, 2019న స్వయంగా పార్లమెంట్‌లో స్పష్టంగా పేర్కొందని వివరించారు. పనులు చేస్తున్న సంస్థను కాదని, ఆధారాలు లేని ఆరోపణలు చేసి కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల పోలవరం మరింత ఆలస్యం అయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండర్లకు పాల్పడ్డారని, ప్రాజెక్టు జగన్ సర్కార్ దెబ్బతీసిందని చంద్రబాబు మండిపడ్డారు. రివర్స్ టెండర్ల ద్వారా రూ.738 కోట్లు ఆదా అని ముందు గొప్పలు చెప్పారని, కానీ చివరకు డయాఫ్రం వాల్‌ను దెబ్బతీశారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.

ఆంధ్రా యూనివర్సిటీని ఫక్తు రాజకీయ కేంద్రం మార్చేశారని గంటా ఫైర్

మున్సిపల్ కార్పోరేషన్‌లపై మంత్రి సమీక్ష.. రూ.14831 కోట్లు పెండింగ్‌

For AP News and Telugu News


విభజన నష్టం కంటే.. జగన్ నష్టమే ఎక్కువ: సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టుకు జగన్ శాపంగా మారారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘‘ఇది తెలుగు జాతికి జరిగిన నష్టం. రాష్ట్రానికి నష్టం చేసే హక్కు ఎవరికీ లేదు. చేతగాకపోతే వెళ్లి ఇంట్లో కూర్చోవాలి. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. 2014 నుంచి 2019 వరకు ప్రాజెక్టు 72 శాతం నిర్మాణం జరిగింది. 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పనులు చేసి గిన్నిస్ బుక్‌లో ఎక్కాం. భవిష్యత్‌లో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేయలేము’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 05:52 PM