Share News

Reactor Explosion: అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..?

ABN , Publish Date - Aug 21 , 2024 | 09:11 PM

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.

Reactor Explosion: అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే..?
AP CM Chandrababu

అమరావతి, ఆగస్ట్ 21: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీలో బుధవారం రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.

Also Read: Kandula Durgesh: పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె.. ‘ఋషికొండ భవనాలు’
Also Read: Mangalagiri: ముగిసిన విచారణ.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన జోగి రమేశ్


అలాగే ప్రమాద ఘటన స్థలాన్ని సైతం సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. ఇప్పటికే ఈ ప్రమాద ఘటనపై ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమల శాఖ సంచాలకుడు, కార్మిక శాఖ కమిషనర్‌, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఎస్డీఆర్ఎఫ్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 41 మందికి మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అవసరమయితే.. క్షతగాత్రులను విశాఖపట్నం లేకుంటే హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు.

Also Read: KTR: తప్పుంటే.. దగ్గరుండి ఫామ్ హౌస్ కూలగొట్టిస్తా

కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను వినియోంచాలని ఉన్నతాధికారులకు సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రమాద ఘటనపై పలుమార్లు జిల్లా కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అలాగే వెంటనే అచ్యుతాపురం వెళ్లాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Also Read: supreme court judgement: వైయస్ జగన్‌కి సుప్రీంకోర్టు చెంపదెబ్బలు

Also Read: West Bengal horror: కోల్‌కతాలో కొనసాగుతోన్న హర్రర్ సీన్స్..


ప్రమాదంపై స్పందించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి.. పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది.

నారా లోకేష్, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి.

Also Read: Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు

Also Read: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’ (వెబ్ స్టోరీ)

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 21 , 2024 | 10:02 PM